ఆ సమయంలో.. ఈ సమస్యలేంటి?
వయసు 23. నాది పొడిచర్మం. ప్రతినెలా పీరియడ్ సమయంలో నుదురు మీద, ముక్కు పక్కనా చిన్న చిన్న పొక్కుల్లా వస్తున్నాయి. నుదుటి మీదవి కొద్దిరోజుల్లో తగ్గుతున్నాయి. కానీ ముక్కు పక్కవి ఎర్రగా మారి దురద పెడుతున్నాయి. సహజంగా తగ్గించుకునే మార్గాలేంటి?
వయసు 23. నాది పొడిచర్మం. ప్రతినెలా పీరియడ్ సమయంలో నుదురు మీద, ముక్కు పక్కనా చిన్న చిన్న పొక్కుల్లా వస్తున్నాయి. నుదుటి మీదవి కొద్దిరోజుల్లో తగ్గుతున్నాయి. కానీ ముక్కు పక్కవి ఎర్రగా మారి దురద పెడుతున్నాయి. సహజంగా తగ్గించుకునే మార్గాలేంటి?
- ఓ సోదరి
ఇది యాక్నే. పీరియడ్ సమయంలో చిన్నగా మొదలై విస్తరిస్తాయి. ఇందుకు బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్, ఒత్తిడి, పీసీఓఎస్, ఎండలో తిరగడం.. ఇలా బోలెడు కారణాలు. కొన్నిసార్లు వాటంతటవే తగ్గుతాయి. దీర్ఘకాలం ఉంటే క్రీములు వాడొచ్చు. ముక్కు పక్కలా వస్తున్నాయన్నారు. చాలావరకూ వంశపారంపర్యమే. చిన్న చిన్న దద్దుర్లు, చీముతో కూడి ఉంటాయి. చర్మమూ ఎర్రబడుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవాలి. కొవ్వుపదార్థాలు, చక్కెరలకు దూరంగా ఉండాలి. పదేపదే ముఖాన్ని తాకడం, మొటిమలు గిల్లడం లాంటివి చేయొద్దు. ఒక్కోసారి 2-5 ఒకేచోట గుంపుగా వస్తుంటాయి. అప్పుడు గోరువెచ్చని నీటితోనే ముఖం కడగాలి. ఆపై ఐస్‌ను వస్త్రంలో పెట్టి వాటిపై రుద్దితే వాపు తగ్గుతుంది. తర్వాత నికోటినమాయిడ్, బెంజైల్ పెరాక్సైడ్, సాల్సిలిక్ ఆసిడ్, టాపికల్ రెటినాయిడ్స్‌ను రాస్తే తగ్గుతాయి. ట్రెటిన్, రెటినాల్, విటమిన్ సి ఉన్న ఉత్పత్తులనే వాడండి. యాంటీ బయాటిక్స్‌నీ వాడాలి. రోజుకోసారి స్పూను యాపిల్ సిడార్ వెనిగర్‌ను మూడు స్పూన్ల నీటిలో కలిపి దూదితో యాక్నే ఉన్నచోట అద్ది, 20 నిమిషాల తర్వాత కడిగేయండి. రెండు స్పూన్ల తేనెకు స్పూను దాల్చినచెక్క పొడి కలిపి సమస్య ఉన్నచోట రాసి, 15 నిమిషాలుంచాలి. పావు గ్లాసు నీటికి స్పూను టీట్రీఆయిల్ కలిపి దూదితో రోజుకు రెండుసార్లు రాసి ఆరాక కడిగేయాలి. చల్లని గ్రీన్ టీని రోజుకు 5-6 సార్లు రాసినా ఫలితముంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.