ఎండల్లో.. హాయ్.. హాయ్!
ఎండలు దంచేస్తున్నాయి. వేడికి తట్టుకోలేక అలమటిస్తున్నాం. కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ, కర్బూజాలతో కాస్త ఉపశమనం పొందుతున్నాం. శరీరాన్ని చల్లబరచు కోవడానికి యోగా కూడా ఉపయోగ పడుతుందంటే
ఎండలు దంచేస్తున్నాయి. వేడికి తట్టుకోలేక అలమటిస్తున్నాం. కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ, కర్బూజాలతో కాస్త ఉపశమనం పొందుతున్నాం. శరీరాన్ని చల్లబరచు కోవడానికి యోగా కూడా ఉపయోగ పడుతుందంటే అతిశయోక్తి కాదు. శీతలీ ప్రాణాయామంతో మండుటెండలు చల్లటి వెన్నెలను తలపిస్తాయి. ప్రయత్నించి చూడండి...
శీతలీ ప్రాణాయామం వాతావరణంలోని వేడి సెగలు శరీరానికి తగలకుండా కాపాడుతూ చల్లదనాన్ని ఇస్తుంది. వేసవిలో వచ్చే సమస్యల బారిన పడకుండా ఉండాలంటే రోజూ చేయాలి. దీని సాధనతో వడదెబ్బ తగలదు. వేడివల్ల వచ్చే అసహనం, అతి దాహం, తొందరగా అలసిపోవడం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటివన్నీ రావు. ముఖ్యంగా ఈ కాలంలో శరీరం ఎండిపోతున్నట్టుగా ఉంటుంది. చెమట ఎక్కువ పట్టడం వల్ల చర్మవ్యాధులు వచ్చే ఆస్కారం ఉంది. వీటన్నిటినీ దూరం చేస్తుంది. ఈ కాలమంతా ఈ ప్రాణాయామం కనుక చేస్తే ఉష్ణోగ్రత ఇంకా పెరిగినా కూడా చల్లగా అనిపిస్తుంది.
ఎలా చేయాలంటే... సౌకర్యంగా ఉండే స్థితిలో వెన్నెముక వంచకుండా నిటారుగా కూర్చోవాలి. నాలుక బయటపెట్టి సున్నాలా చుట్టి, దాని మధ్య లోంచి గాలిని నెమ్మదిగా తీసుకుని ముక్కుతో వదిలేయాలి. ఇలా కనీసం మూడు నుంచి ఐదు నిమిషాల చొప్పున రోజుకు రెండు సార్లు చేస్తే వడదెబ్బ తగలదు. ఇది చిన్నా, పెద్దా అందరికీ మంచిది. ముఖ్యంగా వృద్ధులకు ఇది చాలా అవసరం. ఒకవేళ అప్పటికే వడదెబ్బ తగిలి జ్వరమూ తలనొప్పి లక్షణాలుంటే.. అప్పుడు కూడా ఈ శీతలీ ప్రాణాయామం చేయొచ్చు. జ్వరంతో సహా అన్ని బాధలూ తగ్గుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.