అప్పుడు కూడా హుషారుగా...

ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే అమ్మాయిలూ నెలసరి సమయంలో ముడుచుకుపోతారు. కడుపు నొప్పి, అధిక రక్తస్రావం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. నీరసం, నిస్సత్తువ ఆవరిస్తాయి. ఏ పనీ చేయాలనిపించదు. అకారణ విసుగూ అసహనం కలుగుతాయి

Updated : 30 Apr 2022 12:52 IST

ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే అమ్మాయిలూ నెలసరి సమయంలో ముడుచుకుపోతారు. కడుపు నొప్పి, అధిక రక్తస్రావం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. నీరసం, నిస్సత్తువ ఆవరిస్తాయి. ఏ పనీ చేయాలనిపించదు. అకారణ విసుగూ అసహనం కలుగుతాయి. వాటన్నిటికీ విరుగుడుగా పని చేస్తుంది అర్ధ కపోతాసనం. మీకూ ఈ సమస్యలు ఉంటే దీన్ని ప్రయత్నించి చూడండి. ఆ రోజుల్లోనూ హుషారుగా ఉండండి!

ఎలా చేయాలంటే... ముందు రెండు కాళ్లూ వెనక్కి మడిచి వజ్రాసనంలో కూర్చోవాలి. రెండు చేతులూ కింద పెట్టుకుని ఎడమ కాలును వెనుక వైపు అదిమిపెట్టి ఉంచాలి. తర్వాత మోకాలి వరకూ వంచి పైకి లేపాలి. ఎడమ చేత్తో ఎడమ కాలి పాదాన్ని పట్టుకోవాలి. మెల్లగా కుడిచేతిని బ్యాలెన్స్‌ చేసుకుంటూ ముందుకు చాపి చేతివైపే చూస్తుండాలి. చూపుడు వేలు, బొటనవేలు కలిపి ఉంచాలి. ఒకవేళ స్థిరంగా ఉంచలేకపోతే కుడిచేతిని పైకి లేపకుండా కిందే ఉంచవచ్చు. ఇలా మూడు సార్లు చేయండి. మెల్లగా సేద తీరి మళ్లీ వజ్రాసనంలోకి రండి. ఇలానే కుడికాలితో చేయండి.

ప్రయోజనాలు... రుతుక్రమానికి ముందూ తర్వాతా వచ్చే సమస్యలు తగ్గుతాయి. తుంటి, వెన్ను కింది భాగాలు సేదతీరతాయి. కటి భాగం బలోపేతం అవుతుంది. ఓవరీస్‌, గర్భాశయ, తుంటి కండరాలన్నీ దృఢంగా అవుతాయి. పొత్తి కడుపులో వచ్చే సమస్యలు తగ్గడమే కాదు కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నెలసరి క్రమం తప్పడం లేదా అధిక రక్తస్రావం, అండాశయ, గర్భాశయ సమస్యలు.. ఇలా స్త్రీలకు సంబంధించిన అనారోగ్యాలన్నిటినీ నివారిస్తుంది అర్ధ కపోతాసనం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్