ఏది.. ఎప్పుడు?

కాస్త ఒత్తిడైనా, కంగారుపడినా తెలియకుండానే పెదవి కొరకడం అలవాటు నాకు. అతిగా చేస్తున్నానేమో.. పెదవి పక్కన చర్మం ముడతలు పడుతోంది. దీనికి తోడు బుగ్గల మీద మచ్చలు. వయసేమో పాతికే.

Published : 01 May 2022 01:44 IST

కాస్త ఒత్తిడైనా, కంగారుపడినా తెలియకుండానే పెదవి కొరకడం అలవాటు నాకు. అతిగా చేస్తున్నానేమో.. పెదవి పక్కన చర్మం ముడతలు పడుతోంది. దీనికి తోడు బుగ్గల మీద మచ్చలు. వయసేమో పాతికే. స్నేహితులు ఒకరు రెటినాల్‌, మరొకరు విటమిన్‌ సి క్రీములు సూచిస్తున్నారు. ఏది, ఎప్పుడు ఎంచుకోవడం మేలు?

- ఓ సోదరి

తెలియకుండా చేస్తారు కాబట్టి, ఇలాంటి అలవాట్లు అదుపులో ఉండవు. కొందరిలో గోళ్లు కొరకడం, వెంట్రుకలు పీకుతుండటం లాంటివీ ఉంటాయి. మీకేమో పెదవి కొరకడం. పదే పదే చేస్తున్నారు కాబట్టే.. అక్కడి చర్మం పొడిబారి ముడతలు పడుతోంది. ముందు దీన్ని ఆపడానికి ప్రయత్నించాలి. పళ్ల పరంగా సమస్యలుండి దాన్ని దాచుకోవడంలో భాగంగా పెదవి కొరుకుతోంటే ముందు దంత వైద్యుణ్ణి కలవండి. ఒత్తిడి, ఆందోళనే కారణమైతే సైకాలజిస్ట్‌ సాయం తీసుకోండి. సమస్య అదుపులోకొచ్చాక కొబ్బరి లేదా బాదం నూనెను రాసి, దానిపై పెట్రోలియం జెల్లీ పూయాలి. ఇది తరచూ చేస్తుండాలి. హాల్యురోనాయిక్‌ ఆసిడ్‌ ఉన్న క్రీములూ సాయపడతాయి. వీటితో ముడతలు తగ్గుతాయి. ఇక బుగ్గమీద మచ్చలకు యాక్నే కారణమై ఉండొచ్చు. దీనికి బెంజైల్‌ పెరాక్సైడ్‌, క్లెండమైసిన్‌, నియాసినమైడ్‌ ఉన్న క్రీములు ఉదయం, రెటినాల్‌ ఉన్నవి రాత్రి రాస్తే సరి. ఇంకా యాక్నే వస్తూనే ఉంటే మాత్రం ఓరల్‌ యాంటీ బయాటిక్స్‌, రెటినాల్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే కెమికల్‌ పీల్స్‌నూ చేయించుకోవచ్చు. అయితే వైద్యుల సలహా మాత్రం తప్పనిసరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని