Published : 14/05/2022 00:40 IST

గర్భాశయ కణుతులకు ఉపశమనం

అనేకమంది స్త్రీలకు నెలసరి కొంచెం ఇబ్బందికరమైన సమయం. ఒక్కోసారి క్రమం తప్పడం లేదా ముందే రావడం, అధిక రక్తస్రావం, పొత్తికడుపులో పోట్లు లాంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఆ మూడురోజులూ నడుం నొప్పి, తుంటి నొప్పితో కూడా అవస్థపడుతుంటారు కొందరు. వీటన్నిటికీ విరుగుడుగా పనిచేస్తుంది యోని ముద్ర. ప్రయత్నించి చూడండి... 

ర్ధకపోతాసనం లాంటిదే యోనిముద్ర. ఎంతో ఉపయుక్తమైంది. మనలో సాధారణంగా వచ్చే అనేక గైనిక్‌ సమస్యల నుంచి కాపాడుతుందీ ముద్ర. దీన్ని పద్మాసనంలో కానీ మీకు సౌలభ్యంగా అనిపించే మరే ఆసనంలోనైనా సుఖంగా ఆసీనులై చేయొచ్చు. వెన్నెముక మాత్రం నిటారుగా ఉండేట్లు చూసుకోవాలి. చేతులను సరిగ్గా పొత్తికడుపు వద్ద ఉంచి కళ్లు మూసుకుని కూర్చోవాలి. రెండు చేతుల బొటనవేళ్లూ పైకి వచ్చేవిధంగా కలిపి ఉంచాలి. చూపుడు వేళ్లు రెండూ కలిపి కిందికి ఉంచాలి. మిగతా వేళ్లు మడిచి ఆనించి ఉంచాలి. ఈ ముద్రను కనీసం ఐదు నిమిషాలపాటు చేసినా స్త్రీలకు సాధారణంగా వచ్చే అనేక సమస్యలు తగ్గుతాయి. ఎలాంటి ఇబ్బందులూ లేనివాళ్లు చేయనవసరం లేదనుకోకండి. ఈ ముద్ర చేయడం వల్ల భవిష్యత్తులో సమస్యలు ఉత్పన్నం కావు. అధిక రక్తస్రావం, గర్భాశయంలో కణితి (ఫైబ్రాయిడ్స్‌) లాంటి సమస్యలతో బాధపడేవారికీ బాగా ఉపశమనం లభిస్తుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

మంచిమాట


'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్