సొంతంగా నిర్ణయాలు తీసుకోండి
నా వయసు 25. నాకు సంబంధాలు చూస్తుండగా మా పిన్ని ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ని పరిచయం చేసింది. అతను పెళ్లి చూపుల్లోనే నన్నెంతో ఇష్టపడినా మా వాళ్లు అతని కన్నా మేలని మరో వ్యక్తితో పెళ్లి చేశారు. నా భర్తేమో
నా వయసు 25. నాకు సంబంధాలు చూస్తుండగా మా పిన్ని ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ని పరిచయం చేసింది. అతను పెళ్లి చూపుల్లోనే నన్నెంతో ఇష్టపడినా మా వాళ్లు అతని కన్నా మేలని మరో వ్యక్తితో పెళ్లి చేశారు. నా భర్తేమో ఏడాదికే చనిపోయాడు. ఇప్పుడు నా జీవితం తారుమారైంది. మొదటి వ్యక్తి కాదనుకున్నందుకే ఇదంతా జరిగిందా అనిపిస్తోంది. ఓవైపు బాధ, మరోవైపు మా పిన్ని నాతో మాట్లాడటం మానేసింది. నా జీవితం ఎటుపోతోందో అర్థమవడం లేదు. సలహా చెప్పండి.
ముందుగా మన చేతిలో లేనివాటి గురించి దిగులుపడి ప్రయోజనం లేదని గుర్తించండి! ఇందులో మీరు చేసిందేమీ లేదు. గతం ఎటూ తిరిగిరాదు. కానీ అదే తలచుకుంటూ ప్రస్తుత సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. జరిగిందేదో జరిగింది అనుకుని మీ పిన్నిని కలిసి, మనసులో ఉన్న ఆలోచనలన్నీ పంచుకోండి. ఆమె అర్థంచేసుకుని, అవకాశం ఉంటే మీకు తగిన మరో వ్యక్తిని సూచించగలుగుతారు. అదలా ఉంచి భర్త చనిపోయినంతలో ఇక జీవితం లేదనుకోవద్దు. దుఃఖంతో కాలం గడిపే బదులు మీ చదువూ సామర్థ్యాలకు తగిన ప్రణాళికలు వేసుకుని ఆత్మీయుల సహాయం తీసుకోండి. ఇకపై ఒకరు బాధపడతారేమోనని తొందరపాటుతో ఏదీ చేయొద్దు. నూటికి నూరు శాతం మీ మనసు అంగీకరించినప్పుడే సొంతంగా నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఫలితం ఎలా ఉన్నా బాధ్యత తీసుకోగలుగుతారు, పర్యవసానాలను ఎదుర్కోగలుగుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అతను తగినవాడేనా?
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!