అన్నయ్య ఆస్తి తీసుకోవచ్చా?

అన్నయ్యకి 60 ఏళ్లు. ఇద్దరు పిల్లలు పుట్టాక అన్నయ్య, వదిన విడిపోయారు. ఇది జరిగి 27 ఏళ్లవుతోంది. తర్వాత పిల్లలు, వదిన ఆయనతో ఎప్పుడూ మాట్లాడలేదు. పెద్దబ్బాయి పెళ్లికి ఊళ్లో బంధువులందరికీ చెప్పారు కానీ, అన్నయ్యని పిలవలేదు. మా అమ్మానాన్నా చనిపోయినా రాలేదు. అన్నయ్య బాగోగులు కొన్నేళ్లుగా నేనే చూసుకుంటున్నా. ఆయన స్వార్జితం కాస్త భూమి ఉంది. దాన్ని అమ్ముకోవాలనుకుంటున్నారు. లేదంటే నాకు చెందేలా వీలునామా రాస్తామంటున్నారు. దీని వల్ల మా వదిన, పిల్లల..

Published : 17 May 2022 02:38 IST

అన్నయ్యకి 60 ఏళ్లు. ఇద్దరు పిల్లలు పుట్టాక అన్నయ్య, వదిన విడిపోయారు. ఇది జరిగి 27 ఏళ్లవుతోంది. తర్వాత పిల్లలు, వదిన ఆయనతో ఎప్పుడూ మాట్లాడలేదు. పెద్దబ్బాయి పెళ్లికి ఊళ్లో బంధువులందరికీ చెప్పారు కానీ, అన్నయ్యని పిలవలేదు. మా అమ్మానాన్నా చనిపోయినా రాలేదు. అన్నయ్య బాగోగులు కొన్నేళ్లుగా నేనే చూసుకుంటున్నా. ఆయన స్వార్జితం కాస్త భూమి ఉంది. దాన్ని అమ్ముకోవాలనుకుంటున్నారు. లేదంటే నాకు చెందేలా వీలునామా రాస్తామంటున్నారు. దీని వల్ల మా వదిన, పిల్లల నుంచి ఏమైనా సమస్య ఎదురవుతుందా?

మీ అన్నయ్య స్వార్జితం పూర్తిగా ఆయనకే చెందుతుంది. తనకు నచ్చిన వారికి వీలునామా లేదా గిఫ్ట్‌గా రాయొచ్చు. ఒకవేళ వీలునామా రాయకుండా చనిపోతే అప్పుడు పిత్రార్జితంగా మారుతుంది. అది పిల్లలందరికీ, భార్యకూ వస్తుంది. వీలునామా రాయాలనుకుంటే రిజిస్ట్రేషన్‌ చేయించమనండి. కాగితం మీద రాసినా చెల్లుతుంది, కానీ సాక్షి సంతకాలు తప్పనిసరి. ఆయన తదనంతరం వీలునామా చెల్లదని ఎవరైనా కోర్టులో వేసినా రిజిస్టర్డ్‌ విల్‌ అయితే అధికారికంగా ఉంటుంది. ఎందుకంటే దీనికి రిజిస్ట్రార్‌ ముఖ్య సాక్షి కాబట్టి. కానీ వీలునామా రాయకముందు అన్ని కోణాల్లోనూ ఆలోచించుకోమనండి. ఒకవేళ మీ అన్నయ్య ఆస్తి అమ్మాలనుకుంటే కొనుక్కునే వాళ్లు ఏమీ అభ్యంతరం పెట్టకపోతే అమ్మొచ్చు. కానీ భద్రత కోసం ఇప్పుడు అందరూ పిల్లలూ, భార్య సంతకాలు కావాలంటున్నారు. ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకోమనండి. హిందూ వారసత్వ చట్టం సెక్షన్‌ 25 ప్రకారం వీలునామా ద్వారా వచ్చిన ఆస్తిని పొందడానికి హత్యాయత్నం చేసినా, హత్య చేసినా ఆస్తిని పొందడానికి వీలు లేదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని