అమ్మకు నీరసం పోవాలంటే...

మా అమ్మ వయసు 60. అయిదేళ్లుగా రక్తపోటుతో బాధపడుతోంది. ఈ మధ్య మధుమేహం కూడా తోడైంది. మందులు తీసుకుంటోంది. ఆమె ఎత్తు 5’2’’. బరువు 45కిలోలు ఉండేవారు. రెండేళ్లలో ఆరేడు కిలోలు తగ్గారు. పొలం పనులూ చేస్తుంటారు. కానీ నీరసంగా ఉంటున్నారు. ఆమె ఆరోగ్యానికీ, బలానికీ ఎలాంటి ఆహారం తీసుకోవాలి.

Published : 19 May 2022 01:02 IST

మా అమ్మ వయసు 60. అయిదేళ్లుగా రక్తపోటుతో బాధపడుతోంది. ఈ మధ్య మధుమేహం కూడా తోడైంది. మందులు తీసుకుంటోంది. ఆమె ఎత్తు 5’2’’. బరువు 45కిలోలు ఉండేవారు. రెండేళ్లలో ఆరేడు కిలోలు తగ్గారు. పొలం పనులూ చేస్తుంటారు. కానీ నీరసంగా ఉంటున్నారు. ఆమె ఆరోగ్యానికీ, బలానికీ ఎలాంటి ఆహారం తీసుకోవాలి.

- లక్ష్మి, నెల్లూరు

సగటు భారతీయుల శరీర నిర్మాణం చిన్నగా ఉంటుంది. కిడ్నీ, పాంక్రియాస్‌లాంటి అవయవాల పరిమాణమూ అంతే. దాంతో అవసరానికి మించి ఆహారం తీసుకుంటే అవి శ్రమించలేవు. అందుకే బీపీ, మధుమేహం వస్తాయి. సాధారణంగా పై సమస్యలు రాగానే చాలామంది ఆహారం తగ్గిస్తారు. దానికితోడు ఆవిడ పొలం పనులూ చేస్తున్నారు. కాబట్టి తగినంత శక్తి అందకపోవచ్చు. మందులూ ఓ కారణమే. వీళ్లు ఆహారాన్ని తగ్గించడం కాకుండా ప్రత్యామ్నాయాల్ని ఎంచుకోవాలి.

పాలిష్డ్‌ బియ్యానికి బదులు, నిదానంగా జీర్ణమయ్యే జొన్నలు, కొర్రలు తీసుకోవాలి. రోజుకి 50-55 గ్రా. మాంసకృత్తులు అందాలి. పాలు, పెరుగు, గుడ్డు, సోయా, శనగలు, పెసలు, అలసందలు తీసుకోవచ్చు. వీటిలో మాంసకృత్తులతోపాటు పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలు, కూరగాయాలూ పెంచాలి. విటమిన్లూ పీచు పదార్థం ఉండే జామ, అంజీర, బొప్పాయి లాంటి పండ్లు తీసుకోవాలి. యాపిల్‌, మామిడి కొద్ది పరిమాణంలో తినొచ్చు.

ఉదయం: పాలు తాగొచ్చు. పెసరట్టు, అలసందలు, గుడ్లు తీసుకోవచ్చు. కీర, బత్తాయి తీసుకోవచ్చు. మజ్జిగ తాగొచ్చు.
మధ్యాహ్నం: కొర్ర లేదా జొన్న అన్నం, ఆకుకూరలు, సోయా నగ్గెట్స్‌ తినాలి. నాలుగింటికి గుప్పెడు వేరుశనగ గింజలు లేదా ఓట్స్‌ తీసుకోవాలి. ఆరింటికి కీర, క్యారెట్‌, తర్భూజాలాంటివి తీసుకోవాలి.
రాత్రి: జొన్న రొట్టె, జొన్న రవ్వ, లేదంటే కొర్ర అన్నానికి తోడు పెసర పప్పు, పెరుగు తీసుకోవాలి. చారు, రోటి పచ్చడి తినొచ్చు. తక్కువ నూనెతో వండిన మాంసాహారం కొద్దిగా తీసుకోవచ్చు. ఇవన్నీ పోషకాలిస్తాయి, కానీ బ్లడ్‌షుగర్‌ని పెంచవు. ఈ ఆహార నియమాలు పాటిస్తూ ఓ వారం బ్లడ్‌ షుగర్‌ని గమనించాలి. నియంత్రణలో ఉంటే, ఇదే కొనసాగించాలి. అప్పుడు నీరసం, బరువు తగ్గడం లేకుండానే బీపీ, మధుమేహం నియంత్రణలోకి వస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్