అప్పుడు ఒత్తైన జుట్టే.. కానీ!
చిన్నతనంలో ఒత్తైన జుట్టే. ఎనిమిదో తరగతిలో ఓసారి గుండు చేయించుకున్నా. అప్పట్నుంచీ చాలా సన్నగా తయారైంది. హాస్టల్‌కి వెళ్లాక మరింత పలచనైంది. ఇప్పుడు వయసు 20. ఎన్ని చిట్కాలు వాడినా వెంట్రుకలు మందమవడం లేదు. బయటికెళితే అందరూ ఒకలా చూస్తున్నారు. సాయం చేయండి.
చిన్నతనంలో ఒత్తైన జుట్టే. ఎనిమిదో తరగతిలో ఓసారి గుండు చేయించుకున్నా. అప్పట్నుంచీ చాలా సన్నగా తయారైంది. హాస్టల్‌కి వెళ్లాక మరింత పలచనైంది. ఇప్పుడు వయసు 20. ఎన్ని చిట్కాలు వాడినా వెంట్రుకలు మందమవడం లేదు. బయటికెళితే అందరూ ఒకలా చూస్తున్నారు. సాయం చేయండి.
- ఓ సోదరి
మీ పరిస్థితిని టెల్లోజన్ ఎఫ్లూ వీఎం అంటాం. ఒత్తిడి కారణం. జుట్టు బాగా సన్నగా అవుతుంది. చాలా తక్కువ మందిలో నుదురు పెద్దగా కనిపిస్తుంది. వాతావరణ మార్పులు, రక్తం తగ్గడం, శారీరక బాధలు, లోహాలు, విషపదార్థాల ప్రభావం పడటం, సర్జరీలు.. వంటివి కారణాలు. అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్, హెయిర్ డై వేసుకునేవాళ్లలోనూ కనిపిస్తుంది. ఇవే కారణమైతే 6 నెలలు- ఏడాదిలో మామూలు స్థితి వచ్చేస్తుంది. హార్మోన్ల అసమతౌల్యత, పీసీఓడీ, హైపో థైరాయిడిజం ఉండటం, యాంటీ డిప్రెషన్, గర్భనిరోధక మాత్రలు వాడటం క్రాష్ డైట్ వంటివీ కారణాలే. మీ విషయంలో డైట్ సమస్య అనిపిస్తోంది. ఐరన్, జింక్ బి6, బి12 విటమిన్లు లోపించి ఉండొచ్చు. విటమిన్ డి, జింక్, ఐరన్ పరీక్షలు చేయించుకోండి. ఒత్తిడినీ తగ్గించుకుంటే పరిస్థితి మెరుగుపడుతుంది.
అలోపేసియా ఏరియేటా.. అయితే మొత్తంగా లేదా ప్యాచ్‌లుగా ఊడిపోతుంది. కార్టికో స్టెరాయిడ్స్ వాడటం ద్వారా అదుపు చేసుకోవచ్చు. దీన్నీ చెక్ చేయించుకోండి. 100 కంటే ఎక్కువ వెంట్రుకలు రాలడం, నెలసరి ఇబ్బందులు, యాక్నే, అవాంఛిత రోమాలు వంటివి ఉంటే ఆటో ఇమ్యూన్‌సిస్టమ్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు చెక్ చేసుకోవాలి. ఆకుకూరలు, చిరుధాన్యాలు, చేప, నట్స్, సీడ్స్, వాల్‌నట్స్, అవిసెలు, ఆకుకూరల్ని ఆహారంలో చేర్చుకోవాలి. నీరు తగినంత తాగాలి. వ్యాయామం చేయాలి. యోగా ప్రశాంతతనిస్తుంది. స్ట్రెయిటనింగ్, కర్లింగ్, బ్లోయింగ్‌లకు దూరంగా ఉండాలి. బయోటిన్ సప్లిమెంట్లు తీసుకోవచ్చు. బయటికెళ్లేప్పుడు స్కార్ఫ్ తప్పక ధరించాలి. గట్టిగా లాగడం, జడవేయడం మానాలి. మినాక్సిడల్ సొల్యూషన్ 2%, స్పాట్నో లాక్టమ్ వంటివి వెద్యుల సలహాతో వాడొచ్చు. అత్యవసరమైతే ప్లేట్‌లెట్ ప్లాస్మా రిచ్ థెరపీనీ చేస్తాం.
అలోపేసియా గురించి సమగ్ర కథనం ఏప్రిల్12, వసుంధర సంచికలో ‘సిగ తరిగిపోతుంటే’ శీర్షికన ప్రచురించాం. దీన్ని ఈనాడు.నెట్‌లో చూడొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.