పెళ్లికి ఇస్తామన్న పొలం ఇవ్వలేదు..

మా నాన్నకు నలుగురం ఆడపిల్లలం. మాకో అన్నయ్య. నాన్నకి ఆస్తి బాగానే ఉంది. నా పెళ్లి అప్పుడు ఎకరం పొలం ఇస్తామన్నారు. అప్పట్నుంచీ అడిగిన ప్రతిసారీ ఇస్తామని చెబుతూ వచ్చారు.

Updated : 24 May 2022 12:37 IST

మా నాన్నకు నలుగురం ఆడపిల్లలం. మాకో అన్నయ్య. నాన్నకి ఆస్తి బాగానే ఉంది. నా పెళ్లి అప్పుడు ఎకరం పొలం ఇస్తామన్నారు. అప్పట్నుంచీ అడిగిన ప్రతిసారీ ఇస్తామని చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆస్తి మొత్తం అన్నయ్యకే, నీకేమీ ఇవ్వమంటున్నారు. నాకు ఇస్తామన్న ఆస్తి కోసం న్యాయ పోరాటం చెయ్యొచ్చా?          

- ఓ సోదరి

మీ నాన్నగారికి ఆస్తి ఎక్కడ నుంచి వచ్చింది. పిత్రార్జితమా, స్వార్జితమా. పిత్రార్జితం అయితే ఆస్తిలో మీకు భాగం ఉంది. హిందూ వారసత్వ చట్టం సెక్షన్‌ 29ఎ, సవరణ చట్టం 1985 నుంచి అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం 5-9-1985 నాటికి పిత్రార్జిత ఆస్తి పంపకం జరగకుండా ఉంటే పెళ్లి కాని కుమార్తెకు, 1985 తరువాత పెళ్లి అయిన కుమార్తెకు కూడా సమాన హక్కులు ఇచ్చారు. మీ నాన్నగారి స్వార్జితపు ఆస్తి మీద ఆయనకు పూర్తి హక్కులు ఉంటాయి. మీ నాన్నగారు మీ పెళ్లప్పుడు మీకు పొలం ఇస్తామని ఏదైనా కాగితం రాసి ఇచ్చారా? దానికి సాక్షులు కానీ సాక్షి సంతకాలు చేసి ఉన్నాయా? సాధారణంగా పెళ్లి సమయంలో పసుపు కుంకుమ కింద ఇచ్చే పొలం మీకే రావాలి. కానీ నోటి మాట చెల్లదు. మీతోపాటు మీ అక్కచెల్లెళ్లకీ ఇలానే మాటిచ్చి ఇవ్వడం లేదంటే మీరందరూ కలిసి భాగస్వామ్య దావా వేయండి. కానీ అది పిత్రార్జిత ఆస్తి అయితేనే చెల్లుతుంది. మీకు కాగితం రాసిచ్చి ఉంటే దాని మీద మీ నాన్నగారు, సాక్షుల సంతకాలు ఉంటే మీ వాటా కోసం దావా వేయొచ్చు. 2005లో వచ్చిన హిందూ వారసత్వ చట్టం సవరణ ప్రకారం విభజించబడని పిత్రార్జితం పిల్లలందరికీ చెందుతుంది. చనిపోయిన పిల్లల వారసులు కూడా భాగస్వాములే. ఆస్తి విలువకంటే బంధం విలువ ఎక్కువ. కాబట్టి ముందుగా మధ్యవర్తుల ద్వారా ప్రయత్నించండి. వీలైతే ఏదైనా కౌన్సెలింగ్‌ సెల్‌ ద్వారా వారిని పిలిపించి మాట్లాడించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్