చర్మ తీరు తెలుసుకునేదెలా?

నాకు పదహారేళ్లు, ఇప్పటివరకూ పిల్లల క్రీములే రాస్తూ వచ్చా. ఇక అవి సరిపడవంటున్నారు. ఏం రాయాలి? చర్మతీరుకు తగ్గది ఎంచుకోమంటున్నారు. మరి చర్మ తీరేదో తెలుసుకునేదెలా?

Published : 29 May 2022 01:22 IST

నాకు పదహారేళ్లు, ఇప్పటివరకూ పిల్లల క్రీములే రాస్తూ వచ్చా. ఇక అవి సరిపడవంటున్నారు. ఏం రాయాలి? చర్మతీరుకు తగ్గది ఎంచుకోమంటున్నారు. మరి చర్మ తీరేదో తెలుసుకునేదెలా?

- ఓ సోదరి

* ఎండిపోయి, డల్‌గా ఉంటే పొడిచర్మం. వీరిలో ఇన్‌ఫ్లమేషన్‌ కూడా ఎక్కువే. త్వరగా వృద్ధాప్యఛాయలు వచ్చే అవకాశమెక్కువ. దుమ్మూ, కాలుష్యానికి కొలాజెన్‌ ఉత్పత్తీ తగ్గుతుంది. సబ్బుకు బదులుగా మైల్డ్‌ క్లెన్సర్‌ వాడటం మంచిది. సీరమ్‌తోపాటు క్రీమ్‌ ఆధారిత మాయిశ్చరైజర్‌ వాడాలి. ఉత్పత్తుల్లో ఆలిగో పెప్టైడ్స్‌, హ్యాలురోనిక్‌ ఆసిడ్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, బి5, ప్లాంట్‌ బటర్‌, ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ ఉండేలా చూసుకోండి. మల్టీవిటమిన్‌ మాస్క్‌ వారానికి 2సార్లు పెట్టుకోవాలి.
* ముఖం కడుక్కొన్న కొద్దిసేపటికే ముఖంపై నూనె కారుతున్నట్లు అనిపిస్తే జిడ్డు చర్మం. అతిగా విడుదలయ్యే నూనెలు, వాటిలోకి దుమ్ము చేరడం వంటి వాటి వల్ల యాక్నే అవకాశాలూ ఎక్కువ. ఆయిల్‌ కంట్రోల్‌ ఫేస్‌వాష్‌, ఆల్కహాల్‌ లేని టోనర్‌, మ్యాటే మాయిశ్చరైజర్‌, జెల్‌ బేస్డ్‌ సన్‌స్క్రీన్‌ వాడాలి. రాత్రి సాల్సిలిక్‌ ఆసిడ్‌, గ్లైకాలిక్‌ ఆసిడ్‌ ఉన్న క్రీములు వాడాలి. యాక్నే ఉంటే తగ్గించే క్రీములనీ జోడించుకోవాలి.
* నుదురు, ముక్కు భాగాల్లో జిడ్డుగా ఉండి, మిగతా ప్రాంతాల్లో పొడిగా ఉంటే సాధారణ లేదా కాంబినేషన్‌ చర్మం. జెంటిల్‌ ఫేస్‌వాష్‌, సన్‌స్క్రీన్‌, రాత్రి ఆయిల్‌ ఫ్రీ మాయిశ్చరైజర్‌ రాయాలి. వారానికోసారి చార్‌కోల్‌ ఫేస్‌మాస్క్‌ వేసుకోవాలి. ఉత్పత్తుల్లో హ్యాలురోనిక్‌ ఆసిడ్‌,  గ్లైకాలిక్‌ ఆసిడ్‌, విటమిన్‌ సి, అలోవెరా ఉండేలా చూసుకోవాలి.

చర్మతీరు తెలుసుకోవడం తేలికే. దాని ఆధారంగా స్కిన్‌కేర్‌ రొటీన్‌ను పాటించుకుంటే సరిపోతుంది. వీటికి తోడుగా తాజా కూరగాయలు, విటమిన్‌ సి, ప్రొటీన్‌, ఆకుకూరలు, 3-4 లీటర్ల నీరు తీసుకోవాలి. రోజూ కొద్దిసేపు వ్యాయామాన్నీ చేస్తుండండి. అప్పుడు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని