పులిపిర్లు.. తొలగించేదెలా?

నాకు 26 ఏళ్లు. ముఖం మీద రెండు పులిపిర్లున్నాయి. ఈమధ్య అవి పెద్దగా అవుతున్నాయి. వాటిని తొలగించే మార్గముందా?

Published : 12 Jun 2022 00:32 IST

నాకు 26 ఏళ్లు. ముఖం మీద రెండు పులిపిర్లున్నాయి. ఈమధ్య అవి పెద్దగా అవుతున్నాయి. వాటిని తొలగించే మార్గముందా?

- ఓ సోదరి

హెచ్‌పీవీ వైరస్‌ వల్ల ఇవి వస్తాయి. ఈ వైరస్‌ అదనపు కణాలు పెరిగేలా ప్రేరేపిస్తుంది. దీంతో చర్మం వెలుపల గట్టిపడి పులిపిర్లలా ఏర్పడతాయి. కొందరిలో చిన్నగా వస్తాయి. కొన్ని రకాలు ఒకర్నుంచి ఒకరికి టవల్స్‌, రేజర్‌ వల్లా అంటుకుంటాయి. ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్లలో ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ. వీటిలోనూ రకాలుంటాయి. చేతుల వెనుక, వేళ్లు, గోళ్ల చుట్టూ, ముఖం మీద ఎక్కువగా వచ్చే వాటిని ‘కామన్‌ వాట్స్‌’ అంటారు. ప్లాంటర్‌ వాట్స్‌.. కాళ్లమీద వస్తుంటాయి. ‘ఫ్లాట్‌ వాట్స్‌’.. చిన్నగా, మృదువుగా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కొన్నిసార్లు సైజ్‌ కూడా పెరుగుతాయి. దారాల్లా నోరు, కళ్ల చుట్టూ కనిపించే వాటిని ‘ఫిలిఫాం వాట్స్‌’ అంటాం. ఇవి వేగంగా పెరుగుతాయి.

వీటిని తీయాలంటే... క్రయో సర్జరీ చేయాలి. 2-3 సెషన్లు అవసరం. అయితే కొన్నిసార్లు మచ్చ ఏర్పడొచ్చు. ఎలక్ట్రో సర్జరీలో.. వీటిని కాలుస్తాం. ఇది ఎక్కువగా చేసే పద్ధతి. ఎలాంటి మచ్చ లేకుండా వారంలో తగ్గిపోతుంది. అయితే చేయించుకున్నాక ఎండలో ఎక్కువగా తిరగకూడదు. క్రయోటైజ్‌, స్క్రేపింగ్‌ వంటివీ ఉన్నాయి. కొన్నిరకాల క్రీములతోనూ ఉపశమనం ఉంటుంది. గ్లైకాలిక్‌ ఆసిడ్‌, సాల్సిలిక్‌ ఆసిడ్‌, ట్రెటినాయిన్‌ పీలింగ్‌ క్రీములను వాడొచ్చు. అయితే పెద్దగా ప్రయోజనం ఉండదనే చెప్పాలి. వీటిని పిల్లలకు ఉపయోగిస్తాం. డీసీపీ, ఎమిక్‌ మాయిడ్‌ వంటివీ కొంతమేర తగ్గిస్తాయి. కానీ దురద కలిగిస్తాయి. ఇన్ఫెక్ట్‌ అయిన కణాలను రికవర్‌ చేయడానికి మాత్రం బ్లియోమైసిన్‌ లాంటి ఇంజెక్షన్లూ ఇస్తుంటాం. మీకనువైనదేదో చెక్‌ చేయించుకొని ప్రయత్నించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్