క్రీములు వాడినా.. తగ్గదే!

వయసు 27. కళ్ల కింద నల్లగా తయారవుతోంది. వైద్యులని కలిశా.... ఎన్నో క్రీములు వాడా... ప్రయోజనం లేదు. తగ్గే మార్గం చెప్పండి.

Published : 19 Jun 2022 01:07 IST

వయసు 27. కళ్ల కింద నల్లగా తయారవుతోంది. వైద్యులని కలిశా.... ఎన్నో క్రీములు వాడా... ప్రయోజనం లేదు. తగ్గే మార్గం చెప్పండి.

- ఓ సోదరి

దక్షిణ భారతీయుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. నిజానికిది వంశపారంపర్యం. అలసట, ఎక్కువ పని, నిద్రలేమి, ఎక్కువగా ఎండలో తిరగడం, ఒత్తిడి, తగినంత నీరు తీసుకోకపోవడం, కొన్ని రకాలు అలర్జీలు, కళ్లు నలిపేవారిలోనూ కనిపిస్తుంది. ఎనీమియా, హిమోగ్లోబిన్‌ తక్కువగా ఉండటం, డెర్మటైటిస్‌ వంటి వాటికీ చిహ్నం. వయసు పెరిగేకొద్దీ కొలాజెన్‌ తగ్గి చర్మం పలుచగా అవుతుంది. అందుకే ఎక్కువ అయినట్లుగా కనిపిస్తుంది. ఎక్కువ తేమను అందించే విటమిన్‌ సి, కె, లైకోరైజ్‌ ఉన్న మాయిశ్చరైజింగ్‌ క్రీమ్‌లను రాయాలి. సన్‌స్క్రీన్‌నీ కళ్లకింద తప్పక రాయాలి. రోజూ ఒక ఔన్సు డార్క్‌ చాక్లెట్‌ తినండి. అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి.

కీరా ముక్కల్ని ఫ్రిజ్‌లో పెట్టి బాగా చల్లగా అయ్యాక కళ్లమీద పెట్టుకుంటూ ఉండండి. వారానికి రెండుసార్లు.. బంగాళాదుంప రసాన్ని కళ్ల కింద రాసి, ఆరాక కడిగేయొచ్చు. నిమ్మరసం, రోజ్‌వాటర్‌ స్పూను చొప్పున తీసుకొని కలిపి రాసినా ఫలితముంటుంది. టొమాటో, నిమ్మరసం, బాదం నూనె అరస్పూను చొప్పున తీసుకొని బాగా కలిపి రాయొచ్చు. వీటితోపాటు కళ్లు నలపకుండా ఉండటం, కనీసం ఏడు గంటల నిద్ర ఉండేలా చూసుకోవడం, గుర్తుంచుకొని మాయిశ్చరైజర్‌ రాయడం వంటివీ తప్పక చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. వీటన్నింటితో పూర్తిగా నయమవుతుందని చెప్పలేం కానీ చాలా వరకూ తగ్గుముఖం పడుతుంది. ఇప్పట్నుంచీ సరైన జాగ్రత్త తీసుకుంటే వయసు పెరిగేకొద్దీ మరింత తీవ్రంగా కనిపించకుండానూ ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని