అరుస్తాడు.. అబద్ధాలాడతాడు..

మా బాబుకి 13, హైపరాక్టివ్‌. నాలుగేళ్లప్పుడు మూర్ఛ వస్తే మందులు వాడాం. డాక్టరు సలహాతో తర్వాత ఆపేశాం. మాటిమాటికీ అరుస్తాడు, అబద్ధాలాడతాడు. ఇదీ వంశపారంపర్యమా? స్కూల్లో దొంగిలించాడని ఫిర్యాదు. ఇంట్లోనూ డబ్బు

Published : 27 Jun 2022 02:14 IST

మా బాబుకి 13, హైపరాక్టివ్‌. నాలుగేళ్లప్పుడు మూర్ఛ వస్తే మందులు వాడాం. డాక్టరు సలహాతో తర్వాత ఆపేశాం. మాటిమాటికీ అరుస్తాడు, అబద్ధాలాడతాడు. ఇదీ వంశపారంపర్యమా? స్కూల్లో దొంగిలించాడని ఫిర్యాదు. ఇంట్లోనూ డబ్బు దొంగిలిస్తే తప్పని చెప్పా. ఎప్పుడూ ఫోనే.  వాణ్ని మార్చేదెలా? 

 - ఒక సోదరి

శారీరక పోలికల్లాగే మానసిక లక్షణాలూ అమ్మవైపు, నాన్నవైపు నుంచి వస్తాయి. అలా వచ్చినంతలో మారరని కాదు. వంశపారంపర్యంగా వచ్చే గుణాలతోబాటు చుట్టుపక్కల పరిసరాల ప్రభావమూ ఉంటుంది. మీ అబ్బాయికి చిన్నతనంలోనే మూర్ఛవ్యాధి రావడం, దానికి మందులు వాడటంతో మెదడుపై ప్రభావం పడింది. కోపం, చిరాకు, అసహనం, మొండితనం.. లాంటివన్నీ మూర్ఛవల్ల వచ్చే ప్రవర్తన సమస్యలు. మాట వినకపోవడానికి యుక్తవయసు కూడా కారణం. కరోనా వల్ల ఇంట్లోనే ఉండి ఫోను అలవాటైంది. ఒకటి మూర్ఛవ్యాధి, రెండు టీనేజ్‌, మూడు వాడిన మాత్రలు- మీ బాబు ప్రవర్తనకు ఇవన్నీ కారణమే. ఫిట్స్‌ లోపల్లోపల ఉందేమో ఎలక్ట్రో ఎంసెఫెలోగ్రామ్‌ (ఈఈజీ) చేయించి తెలుసుకోండి. ఇబ్బంది ఉంటే మళ్లీ మందులు మొదలుపెట్టండి. న్యూరాలజిస్టు, సైకాలజిస్టులను సంప్రదించండి. బిహేవియర్‌ థెరపీతో వ్యక్తిత్వంలో మార్పు తెస్తారు. కాలక్రమ పట్టిక ద్వారా క్రమశిక్షణ అలవరుస్తారు. అసభ్య వీడియోలు చూడటం వయసు ప్రభావం. మంచి కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసి వాటిని మానిపిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్