రోగులను చూస్తే భయమేస్తుంది..
పత్రికల్లో ఏదైనా జబ్బు గురించి చదివినప్పుడు, టీవీలో అలాంటివి చూసినపుడు, వ్యాధిగ్రస్తులను కలిసినప్పుడు చాలా భయమేస్తుంది. ఆ జబ్బు నాకో మా కుటుంబసభ్యులకో వస్తే ఎలా అని భయమూ బాధా కలుగుతాయి. ఈ ఆందోళన నుంచి ఎలా బయటపడాలి?
పత్రికల్లో ఏదైనా జబ్బు గురించి చదివినప్పుడు, టీవీలో అలాంటివి చూసినపుడు, వ్యాధిగ్రస్తులను కలిసినప్పుడు చాలా భయమేస్తుంది. ఆ జబ్బు నాకో మా కుటుంబసభ్యులకో వస్తే ఎలా అని భయమూ బాధా కలుగుతాయి. ఈ ఆందోళన నుంచి ఎలా బయటపడాలి?
- ఓ సోదరి
తమకెలాంటి జబ్బూ రాకూడదని అతిగా జాగ్రత్తలు పాటించడం, ప్రతి దానికీ వ్యతిరేకంగా ఆలోచించడం, చెడు జరుగుతుందేమోనని సందేహించే మనస్తత్వం ఉన్నవాళ్లు ఇలా స్పందిస్తారు. ఈ లక్షణాన్ని ‘ఇల్‌నెస్ యాంగ్జయిటీ డిజార్డర్’ అంటారు. ఒకరికి జబ్బు చేసినంతలో అది అందరికీ రాదు. మీది స్వతహాగా ఆందోళన చెందే తత్వం అయ్యుండొచ్చు. లేదా మీ ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేకుంటే మీ అమ్మానాన్నలు గానీ చుట్టుపక్కలవాళ్లు గానీ నెగెటివ్‌గా స్పందించడం చూసి మీకూ అలవాటయ్యుంటుంది.. ఇలాంటివాళ్లు ఎప్పుడూ చెడు జరుగుతుందేమో, జబ్బులొస్తాయేమోనని ఆందోళన చెందుతుంటారు. ఈ మానసిక రుగ్మతకు కాగ్నెటివ్ బిహేవియర్ థెరపీ ఇస్తారు. వ్యాధిగ్రస్తులను చూసినా, కలిసినా ఆందోళన చెందకుండా తర్ఫీదిస్తారు. మీ ఆలోచనా దృక్పథం, స్పందన నిజం కావు. అలా జరగడం చాలా అరుదని చెప్పి, మీ ఆలోచనా తీరును మార్చేందుకు ప్రయత్నిస్తారు. ‘ఎక్స్‌పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్’ లాంటి పద్ధతులతో మీ మానసిక స్థితి మారుతుంది. లేదంటే యాంటీ డిప్రెసెంట్ మందులు తప్పనిసరిగా వాడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.