ఆఫీసులో ఆవేశాలొద్దు...

చదువులైపోయి ఇప్పుడిప్పుడే ఉద్యోగంలో చేరారా?! ఎవరో ఒకరిమీద ఏదో సందర్భంలో కోపం వస్తోందా? ఒద్దొద్దు! చప్పున చల్లబడండి. కుటుంబసభ్యుల మీదో, స్నేహితుల మీదో చూపినట్లు ఆ ఉద్వేగాలూ ఉద్రేకాలను ఆఫీసులో చూపించేశారో..

Updated : 07 Jul 2022 09:03 IST

చదువులైపోయి ఇప్పుడిప్పుడే ఉద్యోగంలో చేరారా?! ఎవరో ఒకరిమీద ఏదో సందర్భంలో కోపం వస్తోందా? ఒద్దొద్దు! చప్పున చల్లబడండి. కుటుంబసభ్యుల మీదో, స్నేహితుల మీదో చూపినట్లు ఆ ఉద్వేగాలూ ఉద్రేకాలను ఆఫీసులో చూపించేశారో.. వెంటనే ముద్రలేసేస్తారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో అవమానిస్తారు. ఇంక్రిమెంట్లకు కత్తెర్లు పడతాయి. ఇంకా పరాకాష్ఠకు వెళ్తే ఉద్యోగాలే ఊడతాయి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే.. పనిచేసే చోట శాంతం, సహనం ఉండాల్సిందే. అదేమీ కష్టం కాదు, ఈ సూత్రాలు పాటిస్తే సరి...

* పై అధికారి మీదో, సహోద్యోగి మీదో కోపమొస్తే గబుక్కున వెళ్లగక్కేయక దీర్ఘంగా శ్వాస తీసుకోండి. వందతో మొదలుపెట్టి వెనక్కి లెక్కబెట్టండి. ఉద్వేగం తగ్గగానే ఆపిన పని కొనసాగించండి. ఈలోపు పరిస్థితి సర్దుకుంటుంది.

* మీ కోపానికి కారణమైన వ్యక్తి, సంఘటన గురించి మీకు బాగా నమ్మకస్థులైన సహోద్యోగితో పంచుకోండి. ఏదైనా పరిష్కారం సూచిస్తారు. లేకున్నా ఔట్‌లెట్‌గా పనిచేసి ఆవేశం తీరుతుంది. ఎవరో ఒకరి ముందు బయటపడ్డారో అది చిలవలు పలవలై వ్యాపిస్తుందని మర్చిపోవద్దు.

* కాసేపు ఆ ప్రదేశం వదిలి వేరే విభాగానికో, క్యాంటిన్‌కో వెళ్లి రండి. ఇటు మీ కోపం చల్లారుతుంది, అటు పరిస్థితీ చక్కబడుతుంది. వాతావరణంలో మార్పుకు ఆ మాత్రం ఎడం ఉండాలి.

* మీకు ఆ క్షణంలో కలిగిన ఆవేశమంతా మీ పర్సనల్‌ మెయిల్లో లేదా ఫోన్లో నెచ్చెలితో చెబుతున్నట్లుగా రాయండి. దాన్ని ఎవరికీ పంపించొద్దు, షేర్‌ చేయొద్దు. ఆవేశమంతా అక్షరాల్లోకి తర్జుమా అయితే కోపం చల్లారుతుంది. దాన్ని తర్వాతెప్పుడో చదివితే మీకే నవ్వొస్తుంది.

* కోపావేశాల్ని మర్చిపోవడానికి ఓ ఐదు నిమిషాలు మీకిష్టమైన వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. వార్తల హెడ్‌లైన్లు చూడండి. వ్యంగ్యోక్తులో ట్విట్టర్‌ ఖాతానో చూడండి. లేదంటే ఫేస్‌బుక్‌, వాట్సప్‌లు చూడండి.

* పెళ్లయితే భాగస్వామికి లేదా ఆత్మీయ బంధుమిత్రులెవరికైనా ఫోన్‌ చేసి మనసు గాయపడిందని మనసు విప్పి చెప్పండి. వాళ్లు చూపే ప్రేమ, అనురాగం సేదతీరుస్తాయి. తాటాకు మంట లాంటి కోపావేశం మీద నీళ్లు చిలకరించినట్లవుతుంది.

* అప్పటికీ మీ కోపం చల్లారలేదంటే మీకు ఎవరి వల్ల ఎందుకు అవమానం జరిగిందో ఉన్నతాధికారి దృష్టికి తీసికెళ్లండి. చెప్పే ధోరణి శాంతంగానే ఉండాలని మర్చిపోవద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్