నల్లగా అయ్యానని బాధపడుతోంది
మా అమ్మాయికి 17 ఏళ్లు. పరీక్షల సమయంలో ముఖాన్ని అస్సలు పట్టించుకోదు. ఇప్పుడేమో ముఖమంతా నల్లగా అయ్యిందని బాధపడుతోంది. వేడినీళ్లతో ముఖం కడుగుతుంది. దీంతో చర్మం బాగా పొడిగా కనిపిస్తోంది. దీనికి పరిష్కారమేంటి.
మా అమ్మాయికి 17 ఏళ్లు. పరీక్షల సమయంలో ముఖాన్ని అస్సలు పట్టించుకోదు. ఇప్పుడేమో ముఖమంతా నల్లగా అయ్యిందని బాధపడుతోంది. వేడినీళ్లతో ముఖం కడుగుతుంది. దీంతో చర్మం బాగా పొడిగా కనిపిస్తోంది. దీనికి పరిష్కారమేంటి.
- ఓ సోదరి, రౌర్కెలా
చర్మంలో మెలనిన్ పెరగడం వల్లే నలుపుదనం. పొడిచర్మం, ఎక్కువ వేడినీళ్లు, రసాయనాలున్న సబ్బులు వాడటం, ఎండలో ఎక్కువ తిరిగే వాళ్లలో ఈ సమస్య కనిపిస్తుంది. కొన్నిరకాల అనారోగ్య సమస్యలు, ఒత్తిడి, హార్మోన్ల ప్రభావం, ఇష్టమొచ్చినట్టు సౌందర్య ఉత్పత్తుల్ని వాడటం వంటివీ కారణాలే. ఎక్కువగా పాల పదార్థాలు, జంక్‌ఫుడ్, చీజ్, చాక్లెట్లు, ప్రాసెస్‌డ్ ఫుడ్, కూల్‌డ్రింక్‌లు, కారం ఎక్కువగా ఉండే వాటిని వీలైనంత దూరంగా ఉంచండి. తాజా పండ్లు, కూర గాయలు, ఆకుకూరలతోపాటు ఒమెగా 3, 6 ఉండే చేపలు, బాదం, వాల్‌నట్స్, నట్స్, చియా, గుమ్మడి, పొద్దుతిరుగుడు విత్తనాలను ఎక్కువగా ఇవ్వాలి. 3-4 లీటర్ల నీటిని తాగేలా చూసుకోండి. కొద్దిసేపైనా వ్యాయామం చేయమనండి. చర్మం బాగుంటుంది. సబ్బుకు బదులుగా మైల్డ్ క్లెన్సర్స్ వాడాలి. చర్మతీరుకు తగిన మాయిశ్చరైజర్, కనీసం ఎస్‌పీఎఫ్ 30 ఉన్న సన్‌స్క్రీన్ తప్పక రాయాలి.
* స్పూను తేనెకు అర స్పూను నిమ్మరసం కలిపి ప్యాక్‌లా వేసి 15 నిమిషాలయ్యాక కడిగేయండి.
* గుడ్డు తెల్లసొనకు స్పూను చొప్పున తేనె, ఓట్స్ కలిపి ఆ పేస్ట్‌ను 20 నిమిషాలుంచి కడిగేయాలి.
* దాల్చినచెక్క పొడికి తేనె కలిపి రాత్రి రాసి 10 నిమిషాలయ్యాక కడిగేయాలి.
* బాదం పొడికి పాలు కలిపి రాసి, ఆరాక కడిగేయాలి. సగం అరటిపండుకు పెరుగు, తేనె కలిపి రాయాలి.
వీటిలో నచ్చినదాన్ని వారానికి రెండుసార్లు రాయండి. ఫలితముంటుంది. తర్వాత తప్పక మాయిశ్చరైజర్ రాయాలి.
ఇంకా... ఆరోగ్యకమైన జీవనశైలి, కనీసం 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. సమస్య తీరుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.