చదవమంటే కోపం

మా అబ్బాయి చదువు మీద ధ్యాస పెట్టలేకపోతున్నాడు. దగ్గరుండి చదివిస్తాను, హోంవర్క్‌ చేయిస్తాను. కానీ తరగతి పెరుగుతున్న కొద్దీ సిలబస్‌ అందుకోలేకపోతున్నాడు. చదవమంటే కోపం, కోప్పడితే దుఃఖం. స్వీట్లు బాగా తింటాడు. బయట బెరుకు, ఇంట్లో అల్లరి.. బాబునెలా మార్చుకోవాలి?...

Published : 18 Jul 2022 00:45 IST

మా అబ్బాయి చదువు మీద ధ్యాస పెట్టలేకపోతున్నాడు. దగ్గరుండి చదివిస్తాను, హోంవర్క్‌ చేయిస్తాను. కానీ తరగతి పెరుగుతున్న కొద్దీ సిలబస్‌ అందుకోలేకపోతున్నాడు. చదవమంటే కోపం, కోప్పడితే దుఃఖం. స్వీట్లు బాగా తింటాడు. బయట బెరుకు, ఇంట్లో అల్లరి.. బాబునెలా మార్చుకోవాలి?

- ఓ సోదరి

మానసిక వేదన ఉన్న పిల్లలు ఎక్కువ తింటారు. ముఖ్యంగా స్వీట్లు. వయసుకు తగిన తెలివితేటలు లేకుంటే పాఠాలు అర్థంగాక మానసిక ఒత్తిడి ఉంటుంది. బయటి నుంచి కూడా ఒత్తిడి ఎదురైతే తట్టుకోలేక కోపం, బాధ కలుగుతాయి. రెండోది అటెన్షన్‌ డెఫిషియెన్సీ డిజార్డర్‌. పిల్లలు పెద్ద క్లాసుకు వచ్చినప్పుడు అర్థం చేసుకుని విశ్లేషించగలగాలి. కానీ ఏకాగ్రతా లోపం ఉంటే చదివినా అర్థంకావు. ఎక్కువ సమయం తీసుకుంటారు. మూడోది టీచర్లు లేదా తోటిపిల్లలు చదువు విషయంలో వెక్కిరించినా, నిరుత్సాహపరచినా న్యూనతతో మెతగ్గా, భయంగా ఉంటారు. సైకియాట్రిస్టుకు చూపిస్తే బాబు మానసిక స్థితి, తెలివితేటలను పరీక్షిస్తారు. ఏకాగ్రతా లోపం ఉంటే దాన్ని అధిగమించే పద్ధతులు నేర్పిస్తారు, కౌన్సిలింగ్‌, అవసరమైతే మందులూ ఇస్తారు. తెలివితేటల్లో వెనకబడితే స్పెషల్‌ ఎడ్యుకేషన్‌తో చదువుకునేలా తోడ్పడతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని