స్ట్రెచ్‌ మార్క్స్‌ పోవాలంటే..

నాకు పాతికేళ్లు. గర్భం దాల్చినప్పుడు బాగా లావయ్యాను. తర్వాత తగ్గినా.. పొట్ట, చేతులు, కాళ్లపై స్ట్రెచ్‌ మార్క్స్‌ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పోగొట్టుకునే మార్గాలను చెప్పండి.

Updated : 24 Jul 2022 05:22 IST

నాకు పాతికేళ్లు. గర్భం దాల్చినప్పుడు బాగా లావయ్యాను. తర్వాత తగ్గినా.. పొట్ట, చేతులు, కాళ్లపై స్ట్రెచ్‌ మార్క్స్‌ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పోగొట్టుకునే మార్గాలను చెప్పండి.

- ఓ సోదరి, ఖరగ్‌పూర్‌

గర్భం దాల్చినప్పుడు చర్మం సాగుతూ వస్తుంది. దీంతో కింది పొరల్లో ఫైబర్స్‌ చినిగి స్ట్రెచ్‌ మార్క్స్‌ ఏర్పడతాయి. ఒక్కసారిగా బరువు తగ్గినప్పుడు కూడా ఇలా జరుగుతుంది. సాధారణంగా ప్రెగ్నెన్సీలో 15 కేజీల వరకూ పెరుగుతుంటారు. పెరిగిన బరువు, హార్మోనుల్లో మార్పులు, వంశపారంపర్యం, బేబీ బరువు, పొడవు.. బట్టి ఈ మార్క్స్‌ పరిమాణం ఉంటాయి. వీటిని తగ్గించు కోవాలంటే... యాంటీ ఆక్సిడెంట్స్‌, ఎ, ఇ విటమిన్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, జింక్‌ ఉన్న వాటికి ఆహారంలో ప్రాధాన్యమివ్వాలి. పాలకూర, క్యారెట్‌, చిలగడదుంప వంటివి రోజూ తినాలి. 8 గ్లాసుల నీళ్లు, పెరుగు, నీరు ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ సమయంలో యోగా, కొద్దిపాటి నడక, కొద్దిపాటి శారీరక వ్యాయామాలతో పాటు ఎ, ఇ విటమిన్‌, ఆలివ్‌ ఆయిల్‌తో మసాజ్‌, యాంటీ ఆక్సిడెంట్‌ క్రీములను రాయడం వంటివి చేస్తే వీటి ప్రభావం చాలావరకూ తగ్గుతుంది. ప్రసవం అయ్యింది కాబట్టి... రెటినాల్‌, కొలాజిన్‌, ఎలాస్టిన్‌, జొజొబా ఆయిల్‌, కోకో బటర్‌, విటమిన్‌ ఇ, ట్రెటిన్‌, గ్లైకాలిక్‌ యాసిడ్‌ క్రీమ్‌లను వాడితే ప్రయోజం ఉంటుంది. వీటితోపాటు మైక్రోడర్మాబ్రేషన్‌ చేయించుకోవచ్చు. ఎక్సిమర్‌ లేజర్‌, పల్స్‌ డై లేజర్స్‌, ఇంటెన్స్‌ పల్సర్‌ లైట్‌ వంటివీ మెలనిన్‌ ఉత్పత్తిని పెంచి చర్మరంగును కాస్త మెరుగుపరుస్తాయి. అయితే ప్రభావం వెంటనే కనిపించదు. కనీసం 20 సెషన్లు తీసుకోవాలి. మరీ పాత మచ్చలకు ఫ్రాక్షనల్‌ లేజర్స్‌ వాడతాం. ఏవైనా పూర్తిగా తగ్గుతాయని చెప్పలేం. 60% అవకాశం ఉంటుంది. పూర్తిగా కావాలంటే ప్లాస్టిక్‌ సర్జరీని ఆశ్రయించొచ్చు. అరకప్పు చక్కెరకు పావు కప్పు బాదం నూనె, చెంచా నిమ్మరసం కలిపి రాయడమో లేదా అలోవెరా గుజ్జును పూసి 20 నిమిషాలయ్యాక కడగడమో చేయాలి. నల్లగా మారకుండా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్