పెళ్లయిన ఏడాదికే గొడవలు..

నా వయసు 23. పెళ్లయి రెండేళ్లయ్యింది. పెళ్లయిన ఏడాది నుంచే ఇద్దరి మధ్యా గొడవలు. అనుమానంతో వేధిస్తాడు. చెప్పుడుమాటలు విని మా వాళ్లను నానా మాటలూ అంటాడు. ఎంతగా సర్దుకుపోతున్నా.. అతను మారతాడన్న నమ్మకం లేదు. ఏం

Published : 08 Aug 2022 00:40 IST

నా వయసు 23. పెళ్లయి రెండేళ్లయ్యింది. పెళ్లయిన ఏడాది నుంచే ఇద్దరి మధ్యా గొడవలు. అనుమానంతో వేధిస్తాడు. చెప్పుడుమాటలు విని మా వాళ్లను నానా మాటలూ అంటాడు. ఎంతగా సర్దుకుపోతున్నా.. అతను మారతాడన్న నమ్మకం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రస్తుతం అమ్మావాళ్ల దగ్గరే ఉంటున్నా. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో చెప్పండి.

- ఓ సోదరి

సాధారణంగా పెళ్లి తర్వాత ఒకర్నొకరు అర్థం చేసుకుని, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడానికి ఒకటి రెండేళ్లు పడుతుంది. ఈలోపు అపార్థాలు వస్తే దానివల్ల ఇద్దరూ ఆందోళన చెందుతారు. అలాంటి పరిస్థితిలో వేరొకరి సాయం తీసుకోకపోతే భేదాలు ఎక్కువైపోయి విడాకుల వరకూ వెళ్తుంది. మీ విషయం అలాగే అనిపిస్తోంది. అతని మానసిక స్థితివల్ల లేదా అతడికి మీగురించి బయటివాళ్లు చెడుగా చెప్పడంవల్ల ఇబ్బంది పెడుతూ మీపట్ల విపరీతవైఖరి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మొదట మీ రెండు కుటుంబాలూ కలిసి చర్చించండి. ఇద్దరూ కలిసుండాలని నిర్ణయించుకుంటే సైకియాట్రిస్టును సంప్రదించండి. ఇద్దరిమధ్యా ఎక్కడ తేడా వస్తున్నదీ వాళ్లు గమనిస్తారు. ఇద్దరి మానసిక స్థితినీ, వ్యక్తిత్వాలనూ పరీక్షించి అవసరమైన సూచనలతో సరిచేస్తారు. అతనికి అనుమానం లాంటి జబ్బు ఏమైనా ఉంటే అది తగ్గేందుకు మందులిస్తారు. ఇద్దరికీ కౌన్సిలింగ్‌ ఇస్తారు. ఒకవేళ అతడు కుటుంబసభ్యుల మాటలు విని బాధపెడుతుంటే ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ కూడా ఇస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్