నిరుద్యోగులంటే చులకన!

హెచ్‌ఆర్‌ మేనేజర్‌ని. నేను రాణించడమే కాదు.. సంస్థ అభివృద్ధికీ సాయపడ్డా. మా బాస్‌, సంస్థ యాజమాని కూడా. ఆయనకి నిరుద్యోగులంటే చులకన. ఇదివరకు ఏ సంస్థలోనూ ఉద్యోగం చేయనివాళ్ల దరఖాస్తులనూ అంగీకరించడు.

Published : 10 Aug 2022 00:33 IST

హెచ్‌ఆర్‌ మేనేజర్‌ని. నేను రాణించడమే కాదు.. సంస్థ అభివృద్ధికీ సాయపడ్డా. మా బాస్‌, సంస్థ యాజమాని కూడా. ఆయనకి నిరుద్యోగులంటే చులకన. ఇదివరకు ఏ సంస్థలోనూ ఉద్యోగం చేయనివాళ్ల దరఖాస్తులనూ అంగీకరించడు. నాకిది అన్యాయమనిపిస్తోంది. ఆయన్ని ఒప్పించేదెలా?

- రాధి, చెన్నై

నిరుద్యోగులైనంత మాత్రాన వారికి ప్రతిభ లేదని భావించాల్సిన పనిలేదు. ఎంతో టాలెంట్‌ ఉండీ లే ఆఫ్‌లు, ఉద్యోగ తీసివేతలు వంటివి ఎదుర్కొంటున్న వారెందరో. అలాంటిది ఉద్యోగానుభవం లేదని ఎంచుకోకపోవడం తెలివితక్కువ తనమే అవుతుంది. ఈ విషయంలో మీ బాస్‌ను మార్చాలంటే మీ అధికారంతోనే సాధ్యం. అతని పక్షపాత ధోరణి ఎంపిక ప్రక్రియపై ప్రభావం చూపకూడదు. కాబట్టి మీరు ‘హెచ్‌ఆర్‌ విభాగం, ఎంపిక విషయాలను చూసుకోవడానికే నన్ను నియమించుకున్నారు. ఈ విషయాల గురించి మీరు కంగారు పడాల్సిన పనిలేదు. నన్ను నమ్మి, సరైన అభ్యర్థులను నియమించే పని నాకు వదిలేయండి’ అని చెప్పండి. కొంచెం భయమనిపించినా ధైర్యంగా, ఆత్మవిశ్వాసం కూడిన గొంతుతో చెప్పి చూడండి. ప్రభావం కనిపిస్తుంది. అంతేకాదు.. ఇప్పటివరకూ హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా కాదు ఆ హోదాతో అతని అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారన్నది మీకూ అర్థమవుతుంది. మీ బాస్‌ తన సీఎఫ్‌ఓకీ పాలసీలు వంటివి రూపొందించడంలోనూ సలహాలిస్తాడా? ఇచ్చినా అందుకాయన అసలు ఒప్పుకోడు కదా. అలాగే మీరూ మీ అధికారాన్ని ఉపయోగించండి. నియామకాల విషయంలో మేనేజ్‌మెంజ్‌ మీ నిర్ణయానికి విలువనిచ్చేలా చూసుకోండి. ప్రతి సీఈఓకీ సంస్థ గురించి కొన్ని ఆందోళనలుంటాయి. కొందరివి అర్థవంతమైనవైతే.. మరికొందరివి అనవసరమైనవి. మీరు మీ పని పట్ల అభయమివ్వగలిగితే ఆయనా వేరే అంశాలపై దృష్టిపెట్టగలుగుతాడు. దీనికి ఓపికతోపాటు నిరంతరం భరోసా కలిగేలా పని చేయగలగాలి మరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని