మా ఆస్తి బాబాయి ఇవ్వడం లేదు!

బాబాయి, నాన్న కలిసి సంపాదించిన ఆస్తి మొత్తం నాన్న అతి నమ్మకం వల్ల బాబాయి పేరు మీద రాయించుకున్నారు. అప్పట్లో మేం చిన్నవాళ్లం. నాన్న చనిపోయి 25 ఏళ్లు. అప్పుడు ఆస్తి వివరాలు, మాకొచ్చే సగం వాటా గురించి బాండ్‌ పేపర్‌ మీద

Updated : 02 Nov 2022 10:56 IST

బాబాయి, నాన్న కలిసి సంపాదించిన ఆస్తి మొత్తం నాన్న అతి నమ్మకం వల్ల బాబాయి పేరు మీద రాయించుకున్నారు. అప్పట్లో మేం చిన్నవాళ్లం. నాన్న చనిపోయి 25 ఏళ్లు. అప్పుడు ఆస్తి వివరాలు, మాకొచ్చే సగం వాటా గురించి బాండ్‌ పేపర్‌ మీద రాశారు. కానీ ఆ ఆస్తిపై ఎటువంటి అధికారమూ మాకివ్వలేదు. తర్వాత కొన్నాళ్లకు మా భాగం అడిగితే పెద్ద మనుషులతో మాట్లాడించి అక్కకు, నాకు పెళ్లిళ్లు చేస్తాననీ, తాత కట్టించిన ఇంట్లో తన వాటాలో సగం మాకు ఇస్తాననీ, నాన్న పేరు మీద ఉన్న స్థలంలో ఇల్లు కట్టిస్తానని బాండ్‌ పేపరు మీద రాసి బాబాయితోపాటు పిన్ని, అన్నయ్య సంతకాలు చేశారు. మా పెళ్లిళ్ల య్యాక మిగిలిన హామీలేవీ నెరవేర్చలేదు. నాన్న పేరు మీదున్న స్థలం అమ్మ పేరు మీదకు మార్చి అమ్ముదాం అంటే రావట్లేదు. తాత ఇంట్లోనూ భాగం ఇవ్వడానికి మొండికేస్తున్నారు. ఆడపిల్లలు మీకెందుకు అంటున్నారు. ఆస్తి మొత్తం వదులుకున్నాం. ఇస్తామని చెప్పినవీ ఇవ్వడంలేదు. మాకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి?

- ఓ సోదరి

గ్రామాల్లో చాలావరకూ వ్యవహారాలు బాండ్‌ పేపర్ల మీద జరుగుతాయి. ఏదైనా సమస్య వస్తే పెద్దల్ని మధ్య పెట్టి పరిష్కరించుకుంటారు. కానీ కోర్టు దాకా వచ్చే సరికి అలా రాసిన కాగితాల న్యాయ పరమైన చెల్లుబాటుని నిరూపించడానికి చాలా కష్ట పడాల్సి వస్తుంది. అందుకే ఆస్తి కొన్నప్పుడే రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం శ్రేయస్కరం. నోటులు, నోటరీలు రాసుకుని తర్వాత చిక్కుల్లో పడుతున్నారెందరో. మీ విషయానికి వస్తే మీ నాన్నగారి ఆస్తి బాబాయి పేరు మీద రిజిస్టర్‌ చేయడం ఒక పొరపాటు. మీ నాన్నగారు చనిపోయాక బాండ్‌ పేపరు మీద రాసిచ్చిన కాగితాన్ని కోర్టులో సాక్ష్యంగా చూపి మీ ఆస్తి మీకు స్వాధీనం చేయమని ‘సూట్‌ ఫర్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ టైటిల్‌ అండ్‌ పొసెషన్‌’ కోసం దావా వేయండి. మీ బాబాయి రాసిచ్చిన కాగితాన్ని రిజిస్ట్రేషన్‌ ఫీజు కట్టి కోర్టులో నిరూపించాల్సి ఉంటుంది. జాయింట్‌ రిజిస్ట్రేషన్‌ ఉన్న ఇల్లు మీ నాన్నగారి సంతకం లేకుండా అమ్మడానికి వీల్లేదు. మీ బాబాయి తన భాగం ఎలా అమ్మారో మరి! తాతగారి పేరుమీదున్న ఆస్తిలో మీకు భాగం ఇవ్వాలని, భాగస్వామ్య దావా కూడా వేయాలి. నాన్న పేరు మీద ఉన్న స్థలం మీ అమ్మగారి పేరు మీద మార్చాలంటే ముందర మీరువారికి వారసులుగా నిరూపించే పత్రం కోర్టు ద్వారా పొందాలి. లీగల్‌ హేర్‌ డిక్లరేషన్‌ సూట్‌ వేయాలి. లాయర్‌ని కలిసి కాగితాలన్నీ చూపిస్తే పరిష్కారం దొరుకుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్