మావారి ఆస్తిని అమ్ముకోలేనా?

నాకు నలుగురు కొడుకులు. ఆయనుండగానే ఆస్తి పంపకాలు జరిగాయి. గత ఏడాది ఆయన పోయారు. ఆ తర్వాత నా పెద్దకొడుకు మావారి పేరు మీదున్న 15 గుంటల పొలం (తాతల నుంచి వచ్చింది), మరో ఇంటి స్థలం (స్వార్జితం) నాపేర మార్పించాడు.

Published : 23 Aug 2022 00:26 IST

నాకు నలుగురు కొడుకులు. ఆయనుండగానే ఆస్తి పంపకాలు జరిగాయి. గత ఏడాది ఆయన పోయారు. ఆ తర్వాత నా పెద్దకొడుకు మావారి పేరు మీదున్న 15 గుంటల పొలం (తాతల నుంచి వచ్చింది), మరో ఇంటి స్థలం (స్వార్జితం) నాపేర మార్పించాడు. 18 ఏళ్లుగా నన్ను, మావారినీ పెద్దపిల్లాడే చూసుకున్నాడు. మిగతా వాళ్లు తోచిన సాయం చేస్తున్నా.. రెండోవాడు మాతో సంబంధాలు తెంచుకున్నాడు. ఇప్పుడు నా వైద్య ఖర్చుల కోసమని నా పేరమీదున్న ఈ ఆస్తిని అమ్మి, ఆ డబ్బుని బ్యాంకులో వేసుకోవాలనుకుంటున్నా. కానీ రెండో వాడు అడ్డుపడుతున్నాడు. కొనడానికి వచ్చిన వాళ్లని బెదిరించి వాటా కావాలంటున్నాడు. అది నాకిష్టం లేదు. ఆ స్థలాన్ని స్వేచ్ఛగా అమ్ముకొనే హక్కు నాకు లేదా?

- ఈశ్వరి, రాజమండ్రి

సాధారణ పరిస్థితుల్లో.. మీవారు ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోతే ఆ ఆస్తి పిల్లలకీ, మీకూ కూడా సమానంగా వస్తుంది. కానీ దానిని మీపేరు మీద మీ పెద్దబ్బాయి మార్పించాడు అంటున్నారు అంటే పట్టాలు చేయించారా లేదా రిజిస్ట్రేషన్‌ చేయించారా అన్నది వివరంగా రాయలేదు. మీ పేరు మీద మార్పించిన ఆస్తి మాత్రం మీకు స్వార్జితమే అవుతుంది. ఒకవేళ రిజిస్ట్రర్‌ డీడ్‌ అయి ఉంటే ఇష్టం వచ్చిన వాళ్లకి మీరు ఇచ్చుకోవచ్చు. ఒకవేళ మీ రెండో అబ్బాయి ‘నాన్న వీలునామా రాయకుండా చనిపోయాడు. ఆ ఆస్తిలో నాకూ వాటా వస్తుంది’.. అంటూ భాగస్వామ్య దావా వేస్తే మాత్రం...  మీపేరు మీద ఆస్తి ఎలా మార్పించుకున్నదీ మీరు నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. మీవారు మీకు ఇచ్చినట్టుగానో, లేదా గిఫ్ట్‌గా ఆయన ఇచ్చినట్టుగానో, వీలునామా రాసినట్టుగానో చూపిస్తూ సాక్ష్యంగా కాగితాలు చూపించాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు అలా నిరూపించుకోలేక పోతే ఆ అబ్బాయికి కూడా మీతో సమానంగా ఆస్తి ఇవ్వాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్