అమ్మ కావడానికి బరువు తక్కువైతే ఇబ్బందా?

అమ్మాయి వయసు 25. పెళ్లై రెండేళ్లు. పిల్లల గురించి ఆలోచించమంటున్నాం. తను మార్కెటింగ్‌ విభాగంలో పనిచేస్తోంది. బరువు తక్కువగా ఉంది. పని ఒత్తిడి కారణంగా సాయంత్రానికి అలసిపోతుంటుంది. ప్రెగ్నెన్సీకి సిద్ధమవ్వడానికి ముందు ఆహారపరంగా ఎలాంటి మార్పులు చేసుకోవాలి.

Updated : 26 Aug 2022 18:11 IST

అమ్మాయి వయసు 25. పెళ్లై రెండేళ్లు. పిల్లల గురించి ఆలోచించమంటున్నాం. తను మార్కెటింగ్‌ విభాగంలో పనిచేస్తోంది. బరువు తక్కువగా ఉంది. పని ఒత్తిడి కారణంగా సాయంత్రానికి అలసిపోతుంటుంది. ప్రెగ్నెన్సీకి సిద్ధమవ్వడానికి ముందు ఆహారపరంగా ఎలాంటి మార్పులు చేసుకోవాలి.

- ఓ సోదరి, విజయవాడ

సాధారణంగా గర్భం దాల్చాక పోషకాహారంమీద దృష్టి పెడుతుంటారు. కానీ వాస్తవానికి ముందే అంటే అండం విడుదలై ఫలదీకరణం చెందిన మొదటి 15 రోజుల్లోనే బిడ్డ శరీర నిర్మాణానికి సంబంధించిన బ్లూప్రింట్‌ మొత్తం తయారవుతుంది. అంటే ముందు నుంచే బరువు, ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడే కాబోయే అమ్మ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా బిడ్డ ఎదుగుదలకూ పోషకాలను అందించగలదు. అంతేకాదు, తన శరీరంలో శక్తి నిల్వలు పెంచుకోవడమూ చాలా అవసరం. బీఎమ్‌ఐ 18 కంటే తక్కువగా ఉన్నప్పుడు చాలా తక్కువ బరువుగా నిర్ధరిస్తారు. కాబట్టి గర్భం దాల్చాలనుకునే మహిళ ఎత్తుకు తగిన బరువు ఉండాలి.

ఏమేం తినాలి...

ఇలాంటివాళ్లు తమ ఆహారంలో మాంసకృత్తులు, ఇనుము, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్లు, జింక్‌, ఒమేగా-3 కొవ్వుల్ని తీసుకోవాలి. ఎక్కువ శక్తి కెలోరీలుండే ఆహార పదార్థాలనూ తినాలి. మాంసాహారంలో గుడ్డు, చికెన్‌, చేపలు మేలు. ఇడ్లీ, సేమియా, ఆవిరి కుడుము, రాగి అటుకులు, పల్లీలూ, పల్లీ చట్నీలూ తీసుకోవాలి. పండ్లకూ, ఎండు పండ్లకూ ప్రాధాన్యమివ్వాలి. బనానా, ఆపిల్‌ లాంటి మిల్క్‌షేక్‌లు తీసుకోవాలి. రక్తహీనత లేకుండా కూడా చూసుకోవాలి. ఎందుకంటే ప్రసవ సమయంలో రక్తం పోవచ్చు. హిమోగ్లోబిన్‌ శాతం పరీక్షించుకుని 11 గ్రా. కంటే తక్కువ ఉంటే బి కాంప్లెక్స్‌, విటమిన్‌-సి వంటివి ఎక్కువగా తీసుకుంటుండాలి. వేవిళ్లు వస్తే ఆహారం అసలే తీసుకోలేని పరిస్థితి. అలాంటప్పుడు ఈ ఆహార నిల్వలు ఉపయోగపడతాయి. ఇలా 3-4 నెలలు తీసుకుంటే క్రమంగా బరువు పెరుగుతారు. అప్పుడు తల్లీ బిడ్డలకు పోషకాల పరంగా ఏ ఇబ్బందీ ఎదురవ్వదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్