భర్త స్నేహితుడు నచ్చాడు...

మావారు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఎప్పుడూ ముభావంగా ఉంటారు. ఆయన ఫ్రెండ్‌ నవ్వుతూ, నవ్విస్తూ చలాకీగా ఉంటాడు. మేం రోజూ ఫోన్‌లో మాట్లాడుకుంటాం. ఈమధ్య సన్నిహితంగా ఉందామంటున్నాడు. నేను తప్పు చేస్తున్నానని

Published : 19 Sep 2022 00:33 IST

మావారు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఎప్పుడూ ముభావంగా ఉంటారు. ఆయన ఫ్రెండ్‌ నవ్వుతూ, నవ్విస్తూ చలాకీగా ఉంటాడు. మేం రోజూ ఫోన్‌లో మాట్లాడుకుంటాం. ఈమధ్య సన్నిహితంగా ఉందామంటున్నాడు. నేను తప్పు చేస్తున్నానని తెలుసు. కానీ దీన్నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదు. 

- ఓ సోదరి, హైదరాబాద్‌

మీవారి వ్యక్తిత్వం తెలిసే పెళ్లి చేసుకున్నారు. అతనిది తక్కువ మాట్లాడే స్వభావమైనా ఇన్నేళ్లు కాపురం చేశారు. మనుషులన్నాక ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ఉంటారు. ఆ స్నేహితుడు కలుపుగోలుగా, మీ ఆశలకు తగ్గట్టుగా ఉన్నందున మీ వారితో పోల్చుకుని మెరుగ్గా ఉన్నట్లు పరిగణించబట్టి ఆకర్షితులయ్యారు. మీ భర్తలో ఇతరత్రా చెడు గుణాలేమీ లేవు, బాగానే చూసుకుంటున్నారని అర్థమవుతోంది. మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే మీకూ, మీ భర్తకీ ఉన్నది చట్టబద్ధమైన బంధం. సమాజపరంగా, నైతికంగా సమ్మతం పొందింది. కానీ ఇతడితో సంబంధం ఏ రకంగానూ మంచిది కాదు. ఎవరూ ఆమోదించరు. ఇలాంటి సంబంధాల్లోకి వెళ్లడమంటే అడుసులో కాలు వేయడమే. మీ భర్తకు తెలిస్తే మానసికంగా కుంగిపోతాడు. సాఫీగా సాగుతున్న జీవితంలో సమస్యలు కొనితెచ్చుకున్నట్టవుతుంది. మిమ్మల్ని మీరే ఒకసారి విశ్లేషించుకుంటే.. ఇలాంటి పని వల్ల మీ పేరుప్రతిష్ఠలు దెబ్బతినడం, కుటుంబ పరువు పోవడం, భవిష్యత్తులో మీకూ, మీ భర్తకూ ఎదురయ్యే మానసిక క్షోభ, సమాజంలో మిమ్మల్ని వెలేసినట్టు చూడటం లాంటివన్నీ అర్థమౌతాయి. ఇవన్నీ ఆలోచించి అతనికి దూరంగా ఉంటే మీకూ, మీ కుటుంబానికీ కూడా మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్