ఆయన బతికుండగాకేసు తేలుతుందా?
మావారు ఒకరి దగ్గర స్థలం కొని రూ.100 స్టాంపు కాగితం మీద అగ్రిమెంట్ రాయించుకున్నారు. అగ్రిమెంట్ చేసిన వాళ్లు గొడవలు పడుతూ స్థలం రిజిస్ట్రేషన్ కానివ్వడంలేదు. ఈ విషయమై మా వారు కోర్టులో దావా వేశారు. ఆయనకి 75 ఏళ్లు.
మావారు ఒకరి దగ్గర స్థలం కొని రూ.100 స్టాంపు కాగితం మీద అగ్రిమెంట్ రాయించుకున్నారు. అగ్రిమెంట్ చేసిన వాళ్లు గొడవలు పడుతూ స్థలం రిజిస్ట్రేషన్ కానివ్వడంలేదు. ఈ విషయమై మా వారు కోర్టులో దావా వేశారు. ఆయనకి 75 ఏళ్లు. ఆయనకేదైనా అయితే కోర్టులో కేసు ముందుకు వెళ్తుందా?
- ఓ సోదరి
ఇప్పుడు స్థలాల వ్యవహారాలన్నీ రిజిస్ట్రేషన్లతోనే జరుగుతున్నాయి. అగ్రిమెంట్స్ కూడా. భూమి విలువ పెరుగుతుండటంతో చాలా మంది అగ్రిమెంట్లు చేశాకా రిజిస్ట్రేషన్ చేయకుండా వెనక్కి వెళ్తున్నారు. ముందే రిజిస్ట్రేషన్ చేయించు కుంటేనే మంచిది. మీ కేసు చూస్తే.. ఇచ్చిన డబ్బుకి స్టాంప్ పేపర్‌తోపాటు వేరే కాగితంమీద రెవెన్యూ స్టాంప్‌తో రసీదు తీసుకున్నారా? కేసు వేసి ఎన్నాళ్లయింది? ఏ కోర్టులో ఉంది? ట్రయల్ స్టేజ్‌కి వస్తే సరే.. నోటీస్ స్టేజ్‌లో ఉంటే చాలా ఏళ్లు పడుతుంది. అగ్రిమెంట్ రాసినవాళ్లు ఎందుకు గొడవ పడుతున్నారు? వాళ్లందరినీ ప్రతివాదులుగా చేర్చారా? అగ్రిమెంట్ ఒక్కరే చేశారా? పిత్రార్జితం అయితే అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లకు భాగం ఉంటుంది. అగ్రిమెంట్ చేసేటప్పుడు తనకు ఆస్తి ఏ విధంగా వచ్చిందో రాశారా? భాగ స్వామ్యం జరిగి తీసుకున్న భాగంగా చూపించి ఉంటే మీ అగ్రిమెంట్ చెల్లుతుంది. కానీ తండ్రికి కొడుకుని కాబట్టి తనకు వస్తుందనే ఉద్దేశంతో రాసుంటే చెల్లదు. ఇవన్నీ త్వరగా తేలాలంటే మధ్యవర్తిత్వమే మేలు. వీళ్లందరూ కోర్టుకు వచ్చారంటే సమస్య పెద్దదవుతుంది. మీవారు ఉండగానే సెటిల్‌మెంట్ చేసుకోవడం మంచిది. ఒకవేళ సెటిల్‌మెంట్ కాకపోతే ఆయన ఉన్నంతవరకు కేసు నడిపించి తదనంతరం మీరు పార్టీలుగా చేరవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.