మెడ, భుజాల దృఢత్వం కోసం...

ఒక నిమిషం పక్కకు తిరిగి మాట్లాడితే మెడ, కాస్త బరువు మోశామంటే భుజాలు నొప్పెడతాయి. ఈ రకమైన ఇబ్బందులను జబ్బులుగా పరిగణించి మందులు వేసుకోలేం.

Published : 29 Oct 2022 01:11 IST

ఒక నిమిషం పక్కకు తిరిగి మాట్లాడితే మెడ, కాస్త బరువు మోశామంటే భుజాలు నొప్పెడతాయి. ఈ రకమైన ఇబ్బందులను జబ్బులుగా పరిగణించి మందులు వేసుకోలేం. అలాగని అసలే నిర్లక్ష్యం చేస్తే మరింత అవస్థపడతాం. ఇలాంటి వాటన్నిటికీ నివారణోపాయం యోగా. గతంలో విపరీత కరణి ఆసన ముద్ర చూశాం కదా! అది చేశాక ఈ మత్స్యాసనం కూడా చేస్తే ఎక్కువ ప్రయోజనం. థైరాయిడ్‌ కూడా త్వరగా అదుపులోకి వస్తుంది. ఇతర ప్రయోజనాలూ ఉన్నాయి.

ఇలా చేయాలి... చేపను పోలి ఉంటుంది కనుక దీన్ని మత్స్యాసనం అంటారు. ముందుగా పద్మాసనంలో కూర్చోవాలి. అంటే కుడికాలిని ఎడమ తొడ మీద, ఎడమ కాలిని కుడి తొడ మీద ఉంచాలి. మెల్లగా రెండు చేతులూ తల పక్కన పెట్టి భుజాలు పైకి లేపి చేతుల సాయంతో తల పైభాగాన్ని కింద ఆనించాలి. తర్వాత ఎడమచేత్తో కుడికాలి బొటనవేలును, కుడిచేత్తో ఎడమకాలి బొటనవేలును పట్టుకుని మోచేతులను ఫొటోలో చూపినట్టు నేలమీద] ఆనించి ఉంచాలి. చేతుల మీద బరువు మోపి ఛాతీభాగం, నడుము ఆర్చిలా పైకి ఉండేలా చూడాలి.

ఈ ఆసనం పూర్తిగా చేయ లేనివాళ్లు పడుకుని రెండు అర చేతులూ చెవుల పక్కన పెట్టుకుని భుజాలు పైకి లేపి తలను నేల మీద ఆనించి చేయడం ఆరంభిస్తే కొన్ని రోజుల తర్వాత పద్మాసనం భంగిమలో చేయడం తేలికవుతుంది.

ఇవీ ప్రయోజనాలు...
కండరాలు దృఢంగా ఉంటాయి. మెడ, భుజాల నొప్పులు తగ్గుతాయి. వెన్నెముక బలపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. నెలసరిలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగుతాయి. పొట్ట దగ్గర కొవ్వు పేరుకోదు. జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది.
శ్వాసకోశ ఇబ్బందులు, ఉబ్బస వ్యాధి ఉన్నవాళ్లకు ఉపశమనం కలుగుతుంది. విపరీత కరణి, మత్స్యాసనాలతో మూడు నెలల్లో థైరాయిడ్‌ సమస్య అదుపులోకి రావడమే కాదు, దానివల్ల వచ్చే సైడ్‌ ఎఫెక్టులు కూడా తగ్గిపోతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్