డిగ్రీ కావాలంటున్నారు..

14 ఏళ్ల అనుభవం ఉంది. సరైన డిగ్రీనే లేదు. ఈ కారణంగానే పదోన్నతులు పొందలేక పోతున్నా.

Updated : 23 Nov 2022 04:59 IST

14 ఏళ్ల అనుభవం ఉంది. సరైన డిగ్రీనే లేదు. ఈ కారణంగానే పదోన్నతులు పొందలేక పోతున్నా. వేరే అవకాశం చూసుకుందామన్నా ఇదే అడ్డవుతోంది. దీన్ని దాటి మంచి జీతంతో కూడిన ఉద్యోగం పొందాలంటే ఏం చేయాలి?

- శ్వేత

ఎంపిక ప్రక్రియలో మొదటి ప్రాధాన్యం ఎక్కువగా విద్యార్హతకే! చాలా తక్కువమంది హెచ్‌ఆర్‌ అధికారులు అనుభవానికి ప్రాధాన్యమిస్తారు. అప్పుడూ కొలువుకు తగ్గ నైపుణ్యాలున్నాయా, తాజా అవసరాలకు తగ్గట్టుగా సిద్ధంగా ఉన్నారా అన్నవి గమనిస్తారు. మీ రంగమేదో ప్రస్తావించలేదు. బాగా పోటీ ఉండేదైతే ఎక్కువ సవాళ్లను ఎదుర్కోవాలి. కొత్త కొలువులో కుదురుకోవాలంటే ఒకటే మార్గం! కనిపించిన ప్రతి ఉద్యోగానికీ దరఖాస్తు చేయద్దు. ఆ రంగంలో నిపుణులతో పరిచయాలు పెంచుకునే ప్రయత్నం చేయండి. సరైన నెట్‌వర్క్‌ ఏర్పరచుకోవడానికి కనీసం ఏడాది నుంచి రెండేళ్లు పట్టొచ్చు కూడా. మీరు కోరుకున్నట్లే తగిన అధికారితో పరిచయం ఏర్పడితే.. మీ నైపుణ్యాలతో ఉద్యోగాన్ని దక్కించుకునే అవకాశం కలుగుతుంది. ఇందుకు ప్రొఫెషనల్‌ గ్రూపుల్లో భాగస్వాములవడం, కాన్ఫరెన్స్‌లకు హాజరవ్వడం వంటివి చేయాలి. దీనికి ఎక్కువ సమయం పడుతుంది అనిపిస్తోందా! అయితే దూరవిద్య ద్వారా డిగ్రీ చేయగలరేమో చూసుకోండి. దాంతో మీ రెజ్యూమెకీ అదనపు విలువ జోడవుతుంది. ఇక మంచి జీతం మీ కెరియర్‌కి ఉన్న డిమాండ్‌, అందుబాటులో ఉన్న అభ్యర్థుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడసలే చాలా సంస్థలు ఆర్థిక మాంద్యం పేరుతో ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. కొత్తవాళ్లని తీసుకున్నా తక్కువ జీతమే ఇస్తున్నాయి. మీరిప్పటికే మంచి జీతం అందుకుంటున్నట్లయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో అంతకు మించి పొందడం కాస్త కష్టమే! చిన్న, మధ్యస్థాయి అయితే కొంత మెరుగుదల పొందొచ్చు. మీ పరిస్థితిని బట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మేలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్