ఆ పదవి ఇవ్వరా?

నేనో సంస్థలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నా. ఇక్కడ నేను సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నా. ఇది నా నాలుగో పదోన్నతి.

Published : 30 Nov 2022 00:43 IST

నేనో సంస్థలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నా. ఇక్కడ నేను సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నా. ఇది నా నాలుగో పదోన్నతి. దీంతో పాటు కార్యనిర్వాహక స్థాయి బాధ్యతలనూ నిర్వహిస్తున్నా. అయినా సరే, నన్ను సెక్రటరీగానే పరిగణిస్తున్నారు. నా పనిలో భాగంగా ఎగ్జిక్యూటివ్‌లతో కలిసి ఈవెంట్లలో ప్రజెంటేషన్లు ఇవ్వాలి. వారికి నా అనుభవంతో మార్గనిర్దేశనం చేయాలి. కానీ, ‘టీమ్‌ బిల్డింగ్‌’ నుంచి మాత్రం నన్ను పక్కకి తప్పిస్తున్నారు. నా వృద్ధికి అవకాశాలున్నాయని చెబుతారు. కానీ అది ఆచరణలో కనిపించడం లేదు.

  - ఓ సోదరి, హైదరాబాద్‌

ఏళ్ల తరబడి సంస్థలో పనిచేస్తున్నా ఒకే పాత్రకు పరిమితమైనట్లు కనిపిస్తోంది. ఉన్నతస్థాయి పదవుల నియామకం విషయంలో మేనేజ్‌మెంట్‌ అప్రమత్తంగా ఉంటుంది. నమ్మకం, సమర్థత కలిగిన సహాయ సిబ్బందిని భర్తీ చేయడం, వారికి శిక్షణ ఇవ్వడం కంటే...కొత్త ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకోవడం సులువని భావించి ఉండొచ్చు. అందుకే కొత్తవారిని తీసుకోవడానికి మొగ్గు చూపించారు. మీకా బాధ్యత అప్పగించడంలేదని బాధపడే ముందు అందుకు తగిన అర్హతలన్నీ మీకున్నాయో లేదో సరి చూసుకున్నారా? మీకు అప్పగించిన అదనపు బాధ్యతల్ని సమర్థంగా పూర్తి చేయడం మంచి విషయమే. అయితే టీమ్‌లో మిమ్మల్ని భాగం చేయకపోవడానికి ఇతర కారణాలూ ఉండి ఉండొచ్చు. వాటి గురించి వారిని పదే పదే ప్రశ్నించడం కంటే... మీరు అందుకు తగిన అర్హత ఉన్న వ్యక్తిగా నిలబడటానికి నైపుణ్యాలను పెంచుకోండి.  నైపుణ్యాలకంటే ముందు మీ నాయకత్వ సంసిద్ధతను నొక్కి చెప్పేలా రెజ్యుమేని మెరుగుపరుచుకోండి. ఒకవేళ  మీరు కోరుకున్న పదవిని అందుకోవడానికి సరైన దిశలో మిమ్మల్ని మీరు ప్రజెంట్‌ చేసుకోలేకపోతుంటే కెరియర్‌ కోచ్‌ల సాయం తీసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని