పీలింగ్‌.. ప్రయత్నించొచ్చా?

ముఖంపై ముడతలు, మచ్చలు. పోగొట్టే ఓ పీలింగ్‌ సొల్యూషన్‌ చూశా. దాని మీద ఏహెచ్‌ఏ, పీహెచ్‌ఏ, బీహెచ్‌ఏ అని ఉన్నాయి. ఏంటవి? వాడటం వల్ల ప్రయోజనం ఉంటుందా?

Published : 02 Apr 2023 00:26 IST

ముఖంపై ముడతలు, మచ్చలు. పోగొట్టే ఓ పీలింగ్‌ సొల్యూషన్‌ చూశా. దాని మీద ఏహెచ్‌ఏ, పీహెచ్‌ఏ, బీహెచ్‌ఏ అని ఉన్నాయి. ఏంటవి? వాడటం వల్ల ప్రయోజనం ఉంటుందా?

- ఓ సోదరి

ల్ఫా, బీటా, పాలీ హైడ్రాక్సీ యాసిడ్‌లను ఏహెచ్‌ఏ, బీహెచ్‌ఏ, పీహెచ్‌ఏగా పిలుస్తారు. వీటిని చర్మం ఆరోగ్యంగా ఉండటానికి వాడతారు. ఇవి చర్మాన్ని లోతుగా శుభ్రం చేసి, పై పొర తొలగేలా చేస్తాయి. దీంతో కొత్తగా వచ్చే చర్మం నునుపుగా, ముడతల్లేకుండా కనిపిస్తుంది. ఇదీ కెమికల్‌ పీలే! యాక్నే, పిగ్మెంటేషన్‌, ముడతలు, గీతలు, మచ్చలు ఉన్నవారికి వాడతాం. పీహెచ్‌ఏ చర్మాన్ని హైడ్రేట్‌ చేస్తుంది. యాంటీ ఏజింగ్‌గానూ పనిచేస్తుంది. ఏహెచ్‌ఏను సెన్సిటివ్‌ చర్మం మినహా ఎవరైనా వాడొచ్చు. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రం చేసి, తేమను అందిస్తుంది. కొలాజెన్‌ ఉత్పత్తికీ తోడ్పడి.. ముడతలు, మచ్చలు, గీతలను పోగొట్టి, చర్మాన్ని మెరిపిస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి బీహెచ్‌ఏ మంచిది. ఇది ఎక్స్‌ఫోలియేట్‌ చేస్తూనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీగానూ పనిచేస్తుంది. యాక్నే, బ్లాక్‌, వైట్‌హెడ్స్‌లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇవి చేయించుకున్నాక మాయిశ్చరైజర్‌, బయటికి వెళ్లేప్పుడు సన్‌స్క్రీన్‌ తప్పక వాడాలి. అయితే ఇవి మంచివే కానీ.. నెట్‌లో చూసి మీకు మీరుగా ప్రయత్నించొద్దు. సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే ప్రమాదముంది. సమస్య తగ్గకపోగా తీవ్రమవొచ్చు. కాబట్టి, వైద్యుల సలహా మేరకే చేయించుకోవాలి. వాళ్లు చర్మాన్ని రెండు వారాల ముందు నుంచే సిద్ధం చేస్తారు. టాపికల్‌ గ్లైకాలిక్‌ యాసిడ్‌, రెటినాయిక్‌ యాసిడ్‌ క్రీములను వాడిన తర్వాతే కెమికల్‌ పీల్‌ చేస్తాం. కాబట్టి, సైడ్‌ ఎఫెక్ట్స్‌ సమస్య ఉండదు. ఇంకా సొరియాసిస్‌, ఎగ్జిమా ఉన్నవారు, గర్భిణులు, పాలిచ్చేవారికి వీటిని అసలు సూచించం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్