క్రీములతో.. జిడ్డు!

నాది పొడిచర్మం. వేడికి క్రీములు రాస్తోంటే జిడ్డు భావన కలుగుతోంది. అలాగని రాయకుండా ఉండలేను. రోజంతా తాజాగా ఉండాలంటే క్రీముల్లో ఏముండేలా చూసుకోవాలి? సహజ మార్గాలనీ సూచించండి.

Published : 23 Apr 2023 00:28 IST

నాది పొడిచర్మం. వేడికి క్రీములు రాస్తోంటే జిడ్డు భావన కలుగుతోంది. అలాగని రాయకుండా ఉండలేను. రోజంతా తాజాగా ఉండాలంటే క్రీముల్లో ఏముండేలా చూసుకోవాలి? సహజ మార్గాలనీ సూచించండి.

- ఓ సోదరి

సబ్బులు, ఎక్కువ వేడి నీటి స్నానాలకు దూరంగా ఉండండి. లిక్విడ్‌ బాత్‌ లోషన్‌, హైలురోనిక్‌ యాసిడ్‌, ఆలిగో పెప్టైడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్‌ బి5, షియా బటర్‌, జొజొబా ఆయిల్‌, రెటినాల్‌, సెరమైడ్స్‌ ఉన్న లైట్‌ మాయిశ్చరైజర్లను ఎంచుకోండి. పగలు వాటర్‌ రెసిస్టెంట్‌ సన్‌స్క్రీన్‌నీ రాయాలి. ఆల్కహాల్‌ ఆధారిత, యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ ఉన్న ఉత్పత్తులు వద్దు. స్కిన్‌కేర్‌ రొటీన్‌లో టోనర్‌, సీరమ్‌లను భాగం చేసుకోండి. పోషణ అందిస్తూనే జిడ్డు భావన లేకుండా చూస్తాయి. వారానికోసారి మల్టీవిటమిన్‌ షీట్‌ మాస్క్‌ వేసుకుంటే మంచిది. సహజంగా ప్రయత్నించాలనుకుంటే కలబందలో ఉండే హైలురోనిక్‌ యాసిడ్‌ చర్మాన్ని రిపేర్‌ చేస్తుంది. రాత్రుళ్లు రాసుకుంటే సరి. అవకాడో గుజ్జుకు తగినంత పెరుగు, స్పూను తేనె, కాస్త పసుపు కలిపి పెట్టుకోండి. 10 నిమిషాలయ్యాక కడగాలి. వారానికి రెండుసార్లు రాయండి. వీటి నుంచి యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోబయాటిక్స్‌ అందుతాయి. రసాయన ఉత్పత్తులకు బదులు కొబ్బరినూనెలో చక్కెర కలిపి స్క్రబ్‌లా వాడండి. మృతకణాలు తొలుగుతాయి. యాక్నే, సెన్సిటివ్‌ స్కిన్‌ ఉన్న వాళ్లు స్క్రబ్‌కి దూరంగా ఉండాలి. ఓట్స్‌ పౌడర్‌కి తేనె, తగినన్ని నీళ్లు కలిపి, ముఖానికి పట్టించి మృదువుగా రుద్ది కడిగేయాలి. పొడిచర్మంవారు హెవీ క్రీములకే ప్రాధాన్యమిస్తారు. బదులుగా పైన చెప్పిన వాటితో లైట్‌ మాయిశ్చరైజింగ్‌ క్రీములను వాడితే సమస్య దూరమవుతుంది. అదనంగా సి, ఇ, బి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే సిట్రస్‌, అవకాడో, ఆకుకూరలు, బీట్‌రూట్‌లను రోజూ తీసుకుంటే సరిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్