వాళ్లు డబ్బులు ఇవ్వలేదు... కేసు పెట్టొచ్చా!

నేనూ, నా భర్త సీనియర్‌ సిటిజన్లం. మాకు సాయంగా ఉంటారని ఇంట్లోని ఓ వాటా అద్దెకు ఇచ్చాం. తీసుకున్న వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి. ఆయన విధి నిర్వహణలో భాగంగా వేరేచోట ఉండేవారు.

Published : 30 May 2023 00:01 IST

నేనూ, నా భర్త సీనియర్‌ సిటిజన్లం. మాకు సాయంగా ఉంటారని ఇంట్లోని ఓ వాటా అద్దెకు ఇచ్చాం. తీసుకున్న వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి. ఆయన విధి నిర్వహణలో భాగంగా వేరేచోట ఉండేవారు. ఇక్కడ ఆయన భార్య, కూతురు నివసించేవారు. ఖాళీ చేసే నాటికి ఒక నెల అద్దె, రెండు నెలల మెయింటెనెన్స్‌, ఇతర ఖర్చులు ఇవ్వాలి. అడిగితే... మా వారికి మెసేజ్‌ పెడితే పంపిస్తారని చెప్పారామె. తర్వాత ఎన్ని ఫోన్లూ, మెసేజ్‌లు చేసినా వారిద్దరూ స్పందించడం లేదు. అద్దె డబ్బులే మాకు ఆధారం. మా వద్ద అద్దె అగ్రిమెంట్లు ఏమీ లేవు. కానీ, వారి ఖాతా నుంచి నా అకౌంటుకి ప్రతినెలా బాడుగ పంపినట్లు ఆధారం ఉంది. ఇప్పుడు మేం వయో వృద్ధుల వేధింపుల కింద వారిపై కేసు పెట్టొచ్చా? ఆ నోటీసుని వాట్సప్‌లో పంపొచ్చా

- ఓ సోదరి

మీరు వారిపై ‘వయో వృద్ధుల వేధింపుల కేసు’ పెట్టాల్సిన పనిలేదు. అద్దె దారులూ, యజమానుల మధ్య సమస్యలు తీర్చడానికి, వారు తమ హక్కులను కాపాడుకోవడానికీ వీలుగా కేంద్ర ప్రభుత్వం ‘నమూనా అద్దె చట్టం- 2021’ తీసుకొచ్చింది. దీనికి అనుగుణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టాలను రూపొందించుకోవచ్చు. అద్దెకి సంబంధించిన వివాదాలపై రెంటల్‌ కోర్టులో ఫిర్యాదు చేయాలి. ముందు ఆ కుటుంబ యజమానికి నోటీస్‌ ఇచ్చి చూడండి. దీన్ని వాట్సప్‌లో పంపిం
చకూడదు. అద్దె డబ్బులు పంపిన ఖాతా వివరాలతో ఆ బ్యాంక్‌ ద్వారా వాళ్ల చిరునామా తెలుసుకునే ప్రయత్నం చేయండి. అద్దెదారు పేరు, హోదా వంటి వివరాలను జతచేసి అతడు పనిచేస్తోన్న కార్యాలయానికి దీన్ని రిజిస్టర్‌ పోస్టులో పంపించండి. ఒకవేళ, అది తిరిగి వచ్చినా ఏమీ ఫరవాలేదు. అప్పుడు కూడా కోర్టులో కేసు వేయవచ్చు. అయితే, నోటీసు ఇచ్చిన సంగతి మాత్రం ఇందులో ప్రస్తావించాలి. ఈ కేసుని రెంటల్‌ కోర్టు ముప్పై రోజుల్లోపు పరిష్కరిస్తుంది. మీకు రావలసిన అద్దె అతని శాలరీ అటాచ్‌మెంట్‌ ద్వారా అందుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్