సీనియర్లతో నడుచుకునేదెలా?

ఈమధ్యే ఐటీ ఉద్యోగంలో చేరా. పక్కవారితో మాట్లాడాలంటే భయం. మామూలుగానే నేను త్వరగా ఎవరితోనూ కలవలేను.

Published : 21 Jun 2023 00:12 IST

ఈమధ్యే ఐటీ ఉద్యోగంలో చేరా. పక్కవారితో మాట్లాడాలంటే భయం. మామూలుగానే నేను త్వరగా ఎవరితోనూ కలవలేను. తెలియకుండా నా సీనియర్లతో చనువు తీసుకొని పొరపాటుగా మాట్లాడితే ఏమనుకుంటారో అనే కంగారు. వారితో ఎలా నడుచుకోవాలి?

- లాలస, హైదరాబాద్‌

ఇంట్రావర్ట్‌లా అనిపిస్తున్నారు. సాధారణంగానే మీలాంటి వాళ్లు నలుగురిలో కలవలేరు. మిగతావాళ్లూ ఈ తీరును విచిత్రంగా చూస్తారు. అలాగని మీలో నైపుణ్యాలు లేవని కాదు. సంస్థలూ ఈ విషయాన్ని గుర్తిస్తున్నాయి. కాబట్టి ఇబ్బంది లేదు.

  • కొత్త ప్రదేశంలో ఎదురెళ్లి మాట్లాడకపోయినా గమనిస్తుంటారు కదా! అదే మీ పెద్ద బలం. బృందసభ్యుల మధ్య సంబంధాలు, పనితీరు, ఎవరితో పనిచేయడం సులువు వంటివి అర్థమవుతాయి. కాబట్టి, ఎవరితో ఎలా ఉండాలనేది తెలుస్తుంది. నచ్చిన వాళ్లతో స్నేహం పెంచుకుంటే సరి. ఎంత సిగ్గయినా.. మీ ఉనికి తెలియొద్దు అనిపించినా ఇతరులతో కలిసి తినడం, బయట కలవడం వంటివి చేయాలి. ‘మన సభ్యురాల’న్న భావన కలిగించినవారు అవుతారు. కొన్నిసార్లు కలవలేకపోవడాన్నీ ‘పాపం సిగ్గు పడుతోంది, త్వరగా మాట్లాడదు’ అనుకొని వదిలేయరు. ‘పొగరు, కఠిన మనస్కురాలు’గానూ భావించొచ్చు. కాబట్టి, సమస్య ఎదురైనప్పుడు, సలహా అడిగినప్పుడు మిన్నకుండిపోకుండా ‘చెప్పడానికి నాకు కాస్త సమయం కావాలి’ అని అడగొచ్చు.
  • కొత్త చోట ఇమడటం ఎవరికైనా సవాలే. పక్కనే ఉండి మాట్లాడలేక.. ఒంటరిగా ఉండలేక ఇబ్బందిగా తోస్తే.. అలా పక్కకు వెళితే సరి. ఒత్తిడి ఉండదు.. మీకంటూ సమయం దొరుకుతుంది. ఒక్కరితో ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలరా? అదే చెప్పండి. నేనింతే అని ఉండిపోకుండా ఉంటే చాలు. ‘కొత్త’ ఆందోళన కలిగించడం మామూలే. అలాగని ఊరుకుంటేనే సమస్య. ప్రతి ఇబ్బందికీ బయటపడే మార్గం ఉంటుంది. వాటి గురించి ఆలోచిస్తూ ముందుకెళ్లండి. సభ్యులతో సులువుగా కలిసిపోతారు.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని