నెలసరి సక్రమంగా రావాలంటే..?

మా పాప 11 ఏళ్లకే రజస్వలైంది.  రెండు సంవత్సరాలు పీరియడ్స్‌ సమయానికే వచ్చేవి. తర్వాత రెండు, మూడు నెలలకోసారి వస్తున్నాయి. నాలుగేళ్ల నుంచి ఇదే పరిస్థితి.

Published : 06 Jul 2023 00:27 IST

మా పాప 11 ఏళ్లకే రజస్వలైంది.  రెండు సంవత్సరాలు పీరియడ్స్‌ సమయానికే వచ్చేవి. తర్వాత రెండు, మూడు నెలలకోసారి వస్తున్నాయి. నాలుగేళ్ల నుంచి ఇదే పరిస్థితి. నువ్వులూ, అవిసె గింజలు రోజూ తింటే నెలసరి సక్రమంగా వస్తుందని విన్నాను. నిజమేనా?

- రాధ, విశాఖపట్నం

నెలసరి సక్రమంగా రాకపోడానికి బరువు తక్కువగా ఉండటం, నీరసం, సరైన ఆహారం తీసుకోకపోవడం, కుటుంబ నేపథ్యం వంటి కారణాలు ఉండొచ్చు. సాధారణంగా 28 నుంచి 40 రోజుల్లోపు నెలసరి వస్తే రుతుక్రమం సక్రమంగా ఉన్నట్టు. కొంతమందిలో ప్రారంభం నుంచే నెలసరిలో అవాంతరాలు ఎదురవుతుంటాయి. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఈ ఇబ్బంది వస్తే చింతించాల్సిన అవసరం లేదు. కానీ కొంతమందిలో ముందు సక్రమంగా వచ్చి, తర్వాత రావు. దీనికి హార్మోన్లË అసమతుల్యత, థైరాయిడ్‌, నిద్రలేమి కారణాలు కావొచ్చు. దీన్నే పాలిసిస్టిక్‌ ఓవరీస్‌ సిండ్రోమ్‌ అంటాం. కౌమార దశలో ఉన్న ఆడపిల్లల్లో ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. మీ అమ్మాయి సమస్య ఏదో తెలుసుకోడానికి వైద్యుల్ని సంప్ర£దించండి. ఇక నువ్వులూ, అవిసె గింజలు తింటే పీరియడ్స్‌ వస్తాయా అంటే... రుతుక్రమం రావడానికి కారణమైన హార్మోన్లను శరీరం తయారు చేసుకోలేదు. దానికి కావాల్సిన ఎసెన్షియల్‌ ఫ్యాట్స్‌ను తయారు చేసుకోవడానికి సరైన ఆహారం అవసరం. ఇవి నువ్వులూ, అవిసె, చియా, అక్రోట్స్‌, శెనగ గింజల్లో ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల అవసరమైన కొవ్వు చేరి నెలసరి సక్రమంగా వస్తుంది. ఇది వారివారి శరీర తీరుపై ఆధారపడి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని