పౌడర్‌ వేయకూడదా?

పసి పిల్లలకు పౌడర్‌ వేయకూడదు. శ్వాస సంబంధ సమస్యలు వస్తాయంటున్నారు. నిజమేనా? కానీ పాపాయి చర్మ ముడతల్లో చెమటకు పాచినట్లుగా అవుతోంది.

Published : 16 Jul 2023 00:47 IST

పసి పిల్లలకు పౌడర్‌ వేయకూడదు. శ్వాస సంబంధ సమస్యలు వస్తాయంటున్నారు. నిజమేనా? కానీ పాపాయి చర్మ ముడతల్లో చెమటకు పాచినట్లుగా అవుతోంది. మంట పుడుతోందేమో పాపం.. ఏడుస్తోంది. తనకేం వాడాలి?

- ఓ సోదరి

దీనిమీద ఎన్నో పరిశోధనలు జరిగాయి. చాలావరకూ అధ్యయనాలు టాల్కమ్‌ పౌడర్ల వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయనే తేల్చాయి. మెగ్నీషియం, సిలికాన్‌ వంటి మినరల్స్‌తో ఇది తయారవుతుంది. తయారీ క్రమంలో ఆస్‌బెస్టాస్‌ కలిసే అవకాశాలు ఎక్కువ. దీంతో ఈ పౌడర్‌ను పిల్లలు పీల్చడం వల్ల జలుబు, దగ్గు, తుమ్ములు వంటివి వస్తుంటాయి. వాళ్లకే కాదు.. పెద్దలకీ ఇది సమస్యే. ఎక్కువమంది జిడ్డు పోయి.. తాజాగా కనిపించాలని వాడుతుంటారు. పిల్లలకేమో చెమటను పీల్చుకుంటుందనీ ఇంకా.. చర్మ, డైపర్‌ ర్యాష్‌ వంటివి పోగొట్టడానికీ రాస్తుంటాం. ఆడవాళ్లూ ఫంగల్‌ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవడానికి జననాంగాల వద్ద ఉపయోగిస్తుంటారు. ఎక్కువ కాలం వాడితే ఒవేరియన్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంది. జననాంగాల ద్వారా ఒవరీస్‌కు చేరిన పౌడర్‌ కణాలు దాదాపు 8 ఏళ్లు ఉండిపోతాయి. తరచూ వాడటం వల్ల పేరుకుపోయి క్యాన్సర్‌కీ దారితీస్తాయి. పిల్లల్లో శ్వాస సంబంధ సమస్యలు, కడుపునొప్పి, ఆకలి తగ్గడం, నీరసం వంటివి వస్తాయి. కాబట్టి వాడకపోవడం మంచిదే.. కావాలంటే టాల్క్‌ ఫ్రీ పౌడర్లు దొరుకుతున్నాయి. వాటిని తెచ్చుకోండి. రసాయనాలవి వద్దు అనిపిస్తే.. మొక్కజొన్న పిండిని చర్మ ముడతలు, దద్దుర్లు వచ్చిన చోట రాయండి. తడిలేకుండా మెత్తని వస్త్రంతో తుడిచి రాస్తే సమస్య తీరుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని