బలపాలు తింటోంది!

మా పాప వయసు 8 ఏళ్లు. చాక్‌పీసులు, సున్నం, పలక పుల్లలు తింటుంది. విటమిన్లు క్యాల్షియం లోపం ఉండటం వల్లే ఇలా చేస్తుంది అంటున్నారు. నిజమేనా? ఈ అలవాటు ఎలా మాన్పించాలి.

Published : 03 Aug 2023 00:07 IST

మా పాప వయసు 8 ఏళ్లు. చాక్‌పీసులు, సున్నం, పలక పుల్లలు తింటుంది. విటమిన్లు క్యాల్షియం లోపం ఉండటం వల్లే ఇలా చేస్తుంది అంటున్నారు. నిజమేనా? ఈ అలవాటు ఎలా మాన్పించాలి. ఇదే కారణమైతే వీటిని భర్తీ చేయడానికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి.

- ఇందు, రాజమహేంద్రవరం

చాక్‌పీసులు, బియ్యం, పలక పుల్లలు లాంటివి తినే అలవాటును గర్భిణులు, పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం. దానికి కారణం రక్తహీనతో, విటమిన్స్‌ లోపమో అనుకుంటాం. కానీ ఇలాంటి చాలా కేసుల్లో మానసిక రుగ్మతలు (బిహేవియరల్‌ డిజార్డర్‌) ఉంటాయి. దాన్నే పికా వ్యాధి అంటారు. ఏదైనా మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు, ఆందోళనలకు గురవుతున్నప్పుడు ఇలాంటి పనులు ఎక్కువగా చేస్తారు. మీ అమ్మాయి ఇలాంటి సమస్యలేవైనా ఎదుర్కొంటుందేమో తెలుసుకోండి. విషయానికి వస్తే ఆమె ఎన్ని రోజులుగా ఇలా చేస్తుందో మీరు చెప్పలేదు. ముందు ఈ అలవాటు ఎప్పటి నుంచి ఉందో, ఎందుకు మొదలైందో సున్నితంగా అడిగి తెలుసుకోండి. రోజూ ఇదే పని చేస్తుందా అనేది గమనించండి. ఇలా నెలరోజులకు పైగా తింటుంటే నిపుణుల్ని (మానసిక, పోషకాహార, పిల్లల) సంప్రదించండి. లివర్‌ ఫంక్షనింగ్‌, హిమోగ్లోబిన్‌, విటమిన్‌ పరీక్షలూ చేయించండి. అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తెలిసిపోతుంది. బరువుకు తగ్గ ఎత్తు ఉందో లేదో తెలుస్తుంది. వైద్యులు చెప్పిన చికిత్సను పాటిస్తూ విటమిన్‌ లోపాలను అధిగమించడానికి పాప ఆహారంలో పాలు, పెరుగు, తృణధాన్యాలు, తాజా కూరగాయలు, నువ్వులు, అవిసెలు, నట్స్‌, పండ్లను చేర్చి వాటిని తగిన మోతాదులో ఇవ్వండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని