కష్టపడినా.. అలా రాశారు!

ఏడాదిగా ఓ ఎంఎన్‌సీలో సేల్స్‌మేనేజర్‌గా చేస్తున్నా. ఒక్క నెల కూడా టార్గెట్‌ మిస్‌ చేయలేదు. అయినా ఆఖర్లో ‘అండర్‌ పర్‌ఫార్మెన్స్‌’ అని రాశారు.

Published : 30 Aug 2023 01:28 IST

ఏడాదిగా ఓ ఎంఎన్‌సీలో సేల్స్‌మేనేజర్‌గా చేస్తున్నా. ఒక్క నెల కూడా టార్గెట్‌ మిస్‌ చేయలేదు. అయినా ఆఖర్లో ‘అండర్‌ పర్‌ఫార్మెన్స్‌’ అని రాశారు. రిపోర్టింగ్‌ మేనేజర్‌తో మాట్లాడితే ‘నేనొచ్చి కొంత కాలమే అయ్యింది. గత బాస్‌ అలా ఇచ్చారేమో! ఈ సంవత్సరం బాగా చెయ్యి. మంచి రేటింగ్‌ ఇస్తా’ అన్నారు. పనిమీద ఆసక్తి పోయింది. ఉద్యోగం మాని ఏదైనా వ్యాపారం చేస్తే మేలేమో అనిపిస్తోంది. ఏం చేయను?

- కావ్య, వైజాగ్‌

పర్‌ఫార్మెన్స్‌ అప్రైజల్స్‌ సరిగా నిర్వహించకపోతే ఉద్యోగుల ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం, బాధ సహజమే. అయితే ఉద్యోగం మానేయడమా, వ్యాపారమా అన్నది అప్రైజల్స్‌ను బట్టి నిర్ణయించుకోవద్దు. ఇది మీ పనిపై ఇచ్చే రిపోర్టు కార్డు కాదు. పనితీరు మీద పై అధికారి అభిప్రాయం మాత్రమే. అది నిజాయతీగా ఇచ్చారా లేదా అన్నది పక్కన పెడితే మరో కోణంలో చూడండి. చాలావరకూ మనం బాగా చేస్తున్నామనే భావిస్తాం. కానీ ఉద్యోగులు తమ పని నాణ్యతను అంచనా వేసుకోవడంలో తప్పటడుగు వేస్తున్నారని ఓ పరిశోధన చెబుతోంది. మీరూ కేవలం టార్గెట్లపైనే దృష్టిపెట్టి, మిగతా వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారేమో! కాబట్టి, అప్రైజల్‌ తప్పుగా ఇచ్చారంటూ వెళ్లినా నష్టం మీకే జరగొచ్చు. ఎందుకంటే ఇదేమీ ఆషామాషీ ప్రక్రియ కాదు. చాలా సమయం పడుతుంది. ఎమోషన్స్‌నీ పరిగణలోకి తీసుకోవాలి. సంస్థ మార్గదర్శకాలు సరేసరి. పైగా రేటింగుకు కారణాన్నీ వివరించాలి. దీనిపై బోలెడు చర్చలూ జరుగుతాయి. కాబట్టి, నెగెటివ్‌ ఆలోచనలు మాని.. దీన్నో పాఠంగా భావించి, పనితీరుపై దృష్టిపెట్టండి. కొత్త బాస్‌ని కలిసి ఏమేం ఆశిస్తారో తెలుసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన రేటింగులో మార్పులు చేయగలరేమో కనుక్కోండి. దానికి మీ వద్దనున్న ఆధారాలు చూపించొచ్చు. అయితే ఈ విషయాన్ని ఇంకెక్కడా చర్చించొద్దు. లేదూ మీపై అయిష్టంతో ఇలా చేశారనిపిస్తే వేరే అవకాశాలను ప్రయత్నించండి. అయితే ఇలాంటివి అరుదు. కష్టపడ్డా ఇలాంటి నెగిటివ్‌ ఫలితం రావడం బాధే! అలాగని తొందరపడొద్దు. నింపాదిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్