పాపకీ నాలాగే వస్తోంది!
వయసు 36. నాకు టీనేజీ నుంచి నోటి చుట్టూ పిగ్మెంటేషన్ ఉంది. పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మా ఎనిమిదేళ్ల పాపకీ అలానే వస్తోంది. ఏం చేస్తే పోతుందో తెలపండి.
వయసు 36. నాకు టీనేజీ నుంచి నోటి చుట్టూ పిగ్మెంటేషన్ ఉంది. పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మా ఎనిమిదేళ్ల పాపకీ అలానే వస్తోంది. ఏం చేస్తే పోతుందో తెలపండి.
- ఓ సోదరి
దీన్ని ఎకాంథోసిస్ నిగ్రికా అంటారు. కొంతమందిలో చర్మ ముడతలు, వేళ్ల మధ్య, మెడ, బాహుమూలల్లోనూ కనిపిస్తుంది. సరిగా స్నానం చేయకపోవడం వల్లే ఇలా నల్లగా అవుతోంది అనుకుంటారంతా. కానీ కాదు. ఒబెసిటీ, రక్తంలో ఇన్సులిన్ స్థాయులు ఎక్కువగా ఉన్నా కనిపిస్తుంది. కొంతమందిలో ఎండ్రోక్రైన్ సమస్య ఉన్నా, కొలెస్ట్రాల్ మందులు వాడుతున్నా కనిపిస్తుంది. మీ విషయంలో వంశపారంపర్యం. వెలుపలి చర్మం పెరిగి, నల్లగా, మందంగా తయారవుతుంది. మెలనిన్ ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఇన్సులిన్ స్థాయులనూ పరీక్షించుకోండి. ఒబెసిటీ, మధుమేహం పెద్దవాళ్లకు ఉంటే పిల్లలకు వచ్చే అవకాశాలెక్కువ. చిన్నపిల్లల వైద్యులకోసారి చూపించండి. కేవలం నోటి చుట్టూనే అయితే కంగారక్కర్లేదు. మాయిశ్చరైజర్, బ్లీచింగ్ క్రీములు, సన్‌స్క్రీన్ తప్పక వాడండి. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం పిల్లలకు తప్పనిసరి చేయండి. బాదం పొడికి తేనె కలిపి రోజూ నోటి చుట్టూ రాసి 15 నిమిషాలయ్యాక కడిగేయాలి. వాల్‌నట్ పొడిలో తగినంత పెరుగు కలిపి రాసి, ఆరాక కడిగేయాలి. దీన్ని వారానికి రెండుసార్లు ప్రయత్నించొచ్చు. స్పూను కీరదోస గుజ్జుకు కొన్ని చుక్కల చొప్పున నిమ్మరసం, గులాబీనీరు కలిపి రాసి, 20 నిమిషాలయ్యాక కడిగేయాలి. వీటన్నింటినీ పాటిస్తే తప్పక సమస్య అదుపులోకి వస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.