దద్దుర్లు.. ఒరుపులు ఎందుకిలా?

వర్షాలు మొదలు అయినప్పటి నుంచీ ఒళ్లంతా ఎర్రగా దద్దుర్లు, దురద. నీళ్లలో కాళ్లు నానితే ఒరుపుల సమస్య. నీటి పొక్కుల్లా వచ్చి విపరీతమైన మంట.

Updated : 17 Sep 2023 07:20 IST

వర్షాలు మొదలు అయినప్పటి నుంచీ ఒళ్లంతా ఎర్రగా దద్దుర్లు, దురద. నీళ్లలో కాళ్లు నానితే ఒరుపుల సమస్య. నీటి పొక్కుల్లా వచ్చి విపరీతమైన మంట. ఇలా ఎందుకొస్తున్నాయ్‌? తగ్గించుకునేదెలా?

 ఓ సోదరి

కాలం అలర్జీలు, ఇన్‌ఫెక్షన్లు సాధారణం. సెన్సిటివ్‌ స్కిన్‌ ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి, వైరల్‌, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు, డెర్మటైటిస్‌, వేడి దద్దుర్లు వంటివి వస్తుంటాయి. ఒకే తువ్వాలు, సబ్బులు వాడటం, పబ్లిక్‌ టాయ్‌లెట్లు ఉపయోగించడం ద్వారా త్వరగా వ్యాప్తి చెందుతాయి. కొందరిలో ఎర్రగా, గుండ్రంగా ప్యాచులుగా మెడ, బాహుమూలలు, పాదాల మీద ఏర్పడుతుంటాయి. పూర్తిగా ఆరిన, పొడి వస్త్రాలనే ధరించండి. సమస్య ఉన్నచోట యాంటీ ఫంగల్‌ డస్టింగ్‌ పౌడర్‌ను రాసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కొందరిలో అథ్లెట్‌ ఫుట్‌ కూడా వస్తుంటుంది. దురద, చర్మం పొరల్లా ఊడుతుంది. పదే పదే పాదాలు తడవడం, తడిచిన బూట్లు వేయడం వల్ల వస్తుంటాయి. నీటి బుడగల్లా వచ్చి, చెడు వాసననీ కలిగిస్తాయి. అందుకే తడిచిన వాటిని వేసుకోవద్దు. గాలి ఆడే చెప్పులకు ప్రాధాన్యం ఇవ్వండి. ఎండ లేదు కదా అని కొందరు సన్‌స్క్రీన్‌ పక్కన పడేస్తారు. దీంతో పిగ్మెంటేషన్‌, చిన్న దద్దుర్లకు కారణమవుతుంది. వాతావరణంతో సంబంధం లేకుండా రోజూ సన్‌స్క్రీన్‌ తప్పనిసరిగా రాయాలి. ఫేషియల్‌ ఫాలిక్యులైటిస్‌.. ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దుమ్ము చర్మ రంధ్రాల్లో పేరుకొని బ్లాక్‌, వైట్‌ హెడ్స్‌ వస్తుంటాయి. మాయిశ్చరైజర్‌తోపాటు సమస్య ఉన్నచోట పర్మథ్రిన్‌ వంటి క్రీములు వాడండి. జెంటిల్‌ క్లెన్సర్‌తో రెండు పూటలా స్నానం తప్పనిసరిగా చేయండి. శరీరమంతా పూర్తిగా తుడుచుకున్నాకే వస్త్రాలు ధరించండి. ఈ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని