జుట్టు నెరుస్తోంది.. ఏం తినాలి?
మాంసకృత్తులు, అమైనో యాసిడ్స్ అందకపోవడం, పోషకాహార లోపం వంటి సమస్యల వల్ల యుక్త వయసులోనే జుట్టు నెరుస్తుంది. జింక్, బి12, కాపర్, ఐరన్ లాంటి విటమిన్లు తగిన స్థాయిలో లేకపోవడమూ ఇందుకు కారణమే. నెరవడంలో రెండు రకాలు ఉంటాయి. కురులు మొదళ్ల నుంచి తెల్లగా మారుతోంటే.. వంశపారంపర్యం అయ్యుండొచ్చు.
24 ఏళ్లు, విద్యార్థినిని. ఏడాదిగా జుట్టు నెరిసిపోతోంది. థైరాయిడ్, పీసీఓడీ సమస్యలేమీ లేవు. తెల్లజుట్టుతో నలుగురిలోకి వెళ్లలేకపోతున్నా. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది?
- సింధు, హైదరాబాద్
మాంసకృత్తులు, అమైనో యాసిడ్స్ అందకపోవడం, పోషకాహార లోపం వంటి సమస్యల వల్ల యుక్త వయసులోనే జుట్టు నెరుస్తుంది. జింక్, బి12, కాపర్, ఐరన్ లాంటి విటమిన్లు తగిన స్థాయిలో లేకపోవడమూ ఇందుకు కారణమే. నెరవడంలో రెండు రకాలు ఉంటాయి. కురులు మొదళ్ల నుంచి తెల్లగా మారుతోంటే.. వంశపారంపర్యం అయ్యుండొచ్చు. మానసిక, శారీరక ఒత్తిళ్ల కారణంగా ఫ్రీరాడికల్స్ ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. ఇవి కుదుళ్లలో రంగునిచ్చే మెలనోసైట్స్ అనే హార్మోన్ ఉత్పత్తికి ఆటకం కలిగించి, జుట్టు నెరిసేలా చేస్తాయి. అంతేకాదు కురులు శక్తి కోల్పోయి, రాలిపోతాయి కూడా. రెండో దానిలో జుట్టు అక్కడక్కడా రంగు మారుతుంది. సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. మీరే కోవకు చెందుతారో తెలుసుకోండి. రెండో కారణమైతే పారా అమైనో బెంజోయిక్ యాసిడ్స్ అధికంగా ఉండే దంపుడు బియ్యం, పొట్టుతో ఉన్న గింజధాన్యాలు, మొలకెత్తిన గింజలు, పాలు, పెరుగు, సోయా మిల్క్ లాంటివి ఎక్కువగా తినాలి. విటమిన్ల లోపంతో బాధపడుతున్న చాలామంది దీనికి సప్లిమెంట్స్ వాడుతుంటారు. అలాకాకుండా సరైన మోతాదులో మాంసకృత్తులు, విటమిన్ బి ఉండే ఆహారం, తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినడం మేలు. వీలైనంత వరకూ బయటి ఆహారం తినొద్దు. ఎక్కువ ఉడకబెట్టిన, ప్రాసెస్ చేసిన వాటికీ దూరంగా ఉంటూ పోషకాహారాన్ని క్రమం తప్పకుండా మూడు నెలలు తింటే ఫలితం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.