ఎప్పుడూ పుస్తకాలేనా?

పదో తరగతికి వచ్చా. కొత్త స్కూలు, స్నేహితులే లేరు. పైగా కొన్ని పాఠాలు కూడా పూర్తయ్యాయి. ఒత్తిడిగా అనిపిస్తోంది. పంచుకుందామన్నా వినేవారూ లేరు. అమ్మానాన్నలకు చెబితే ప్రతిదానికీ ‘ముందు ఆ ఫోన్‌ పక్కన పడేయ్‌. దానివల్లే సమస్యంతా’ అంటారు. తలనొప్పి అయినా, చిరాకుగా ఉందన్నా ఇదే మాట. అస్తమాను పుస్తకాలతోనే ఉండాలంటే ఎలా? నన్ను అర్థం చేసుకునేవారే లేరు అనిపిస్తోంది. 

Published : 31 May 2024 03:36 IST

పదో తరగతికి వచ్చా. కొత్త స్కూలు, స్నేహితులే లేరు. పైగా కొన్ని పాఠాలు కూడా పూర్తయ్యాయి. ఒత్తిడిగా అనిపిస్తోంది. పంచుకుందామన్నా వినేవారూ లేరు. అమ్మానాన్నలకు చెబితే ప్రతిదానికీ ‘ముందు ఆ ఫోన్‌ పక్కన పడేయ్‌. దానివల్లే సమస్యంతా’ అంటారు. తలనొప్పి అయినా, చిరాకుగా ఉందన్నా ఇదే మాట. అస్తమాను పుస్తకాలతోనే ఉండాలంటే ఎలా? నన్ను అర్థం చేసుకునేవారే లేరు అనిపిస్తోంది. 

ఓ సోదరి

దోతరగతి అనగానే మన చుట్టూ ఉన్నవాళ్లంతా అనవసరమైన ప్రాధాన్యత ఇస్తారు. తల్లిదండ్రులు, టీచర్స్, బంధువులు అందరి దృష్టి నీ మీదే ఉంటుంది. ఎప్పుడు కనిపించినా ఎలా ప్రిపేర్‌ అవుతున్నావు? ఎంత శాతం వస్తుంది? అనే విషయాలే చర్చిస్తారు. దీనివల్ల మీలాంటి పిల్లలు ఇంకా ఎక్కువగా ఒత్తిడికి గురవుతారు. నీ విషయంలో స్కూల్‌ మారడం, కొంత సిలబస్‌ పూర్తి అయిపోవడం, కొత్త స్నేహితులు ఎవరూ లేకపోవడం, నీలో భయం కలిగిస్తూ, అసహనానికి దారి తీస్తున్నాయి. నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. భాదపడుతూ కూర్చుంటే పరిష్కారం లభించదు. అందుకే ముందుగా, నీ క్లాస్‌లో ఎవరితో స్నేహం చేయొచ్చో గమనించు. వాళ్లతో నువ్వు కొత్తగా రావడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నావో చెప్పి, స్కూల్‌ గురించి, టీచర్స్‌ గురించి తెలుసుకో. పూర్తి అయిన సిలబస్‌ గురించి వారితో చర్చించి, వాటిని అర్థం చేసుకోవడంలో సాయం తీసుకో. నువ్వు కొంత ప్రయత్నిస్తే, వాళ్లు కూడా ముందుకు వచ్చి నిన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. చదువులో సాయపడతారు. టీచర్లను కూడా గమనించి, ఎవరు స్టూడెంట్స్‌ పట్ల సానుకూలంగా ఉన్నారో, వారితో నీ సమస్య చెప్పు. ఏ సబ్జెక్టు ఎలా చదవాలో కొన్ని మెలకువలు చెబుతారు. అందరి సలహాలు తీసుకుని నువ్వు ప్రణాళిక వేసుకుని చదువు. అప్పుడు రోజంతా చదవక్కర్లేదు. విరామ సమయంలో నీకు నచ్చిన పని చేసుకుంటూ (అలా అని మొబైల్‌ మీద ఎక్కువ సమయం పెట్టొద్దు), ఎటువంటి ఆందోళన లేకుండా టెన్త్‌ క్లాస్‌ పూర్తిచేయొచ్చు. వర్రియర్‌గా కాకుండా వారియర్‌గా నీసత్తా ఏంటో చూపించు.  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్