మొటిమలు రాలేదు కానీ...

ముఖం మీద నల్లని మచ్చలొస్తున్నాయి. మొటిమలు తగ్గాక వచ్చేవాటిలా ఉన్నాయి కానీ, ఈ మధ్యకాలంలో అలాంటివేమీ రాలేదు.

Published : 02 Jun 2024 01:52 IST

ముఖం మీద నల్లని మచ్చలొస్తున్నాయి. మొటిమలు తగ్గాక వచ్చేవాటిలా ఉన్నాయి కానీ, ఈ మధ్యకాలంలో అలాంటివేమీ రాలేదు. మరి ఏమిటివి? ఎందుకిలా వస్తున్నాయి?

ఓ సోదరి

పుట్టుమచ్చలంటే పుట్టినప్పుడే వస్తాయి అనుకుంటాం కానీ, పెరిగేకొద్దీ కూడా కొందరిలో వస్తాయి. పైగా ఇవి ఎక్కువగా నలుపు, ముదురు గోధుమ రంగుల్లో ముఖంమీదే వస్తుంటాయి. వీటివల్ల సమస్య ఏమీ ఉండదు. కొన్నిరకాలు మాత్రం క్యాన్సర్‌గా మారే అవకాశముంది. అవి ఎక్కువగా నీలం, గులాబీ, ఎరుపు... ఇలా రకరకాల రంగుల్లో, ఉబ్బెత్తుగా, ముడతలతో ఉంటాయి. కాబట్టి, వాటిని గుర్తించడమూ సులువే. అయితే ఇలాంటివి మన భారతీయుల్లో చాలా అరుదు. ఇక మీ విషయంలో ఇవి పుట్టుమచ్చలు లేదా ఫ్రెకల్స్‌ అయ్యుండొచ్చు. హార్మోనుల్లో అసమతుల్యత, ప్రెగ్నెన్సీ, మెనోపాజ్, ఎండలో ఎక్కువగా తిరగడం... ఇలా వీటికి బోలెడు కారణాలు. కొందరిలో కళ్లు, ముక్కు చుట్టూ కూడా వస్తాయి. రానురానూ ఎండ కారణంగా ముదురు నలుపు రంగులోకి మారుతోంటే ఫ్లాష్‌ మోల్స్‌ అంటాం. లేత గోధుమరంగులో ఉంటే ఫ్రెకల్స్‌గా చెప్పొచ్చు. ఇవి చిన్నచిన్నగా ఉంటాయి. వీటిలో ఎఫిలైడ్స్, లెంటిజెల్స్‌ అని రెండు రకాలూ ఉంటాయి. వీటికి వంశపారంపర్యం కూడా కారణమే. పైగా త్వరగా పోవు కూడా. అందుకే వీలైనంతవరకూ ఉదయం 10 గం. నుంచి మధ్యాహ్నం 4 గం.ల్లోపు ఎండలో బయటికి వెళ్లకూడదు. వెళ్లాల్సివస్తే సన్‌స్క్రీన్‌ రాసుకోవడం, స్కార్ఫ్‌ లేదా గొడుగు వాడటం చేయాలి. అప్పుడే ఎక్కువ కావు. పుట్టుమచ్చలైతే ఏమీ చేయలేము కానీ ఫ్రెకల్స్‌ అయితే లేజర్‌తో తగ్గించొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్