జిడ్డు... చుండ్రు... దురద!

తలస్నానం చేసిన రెండో రోజుకే జుట్టు జిడ్డుగా మారిపోతోంది. దానికితోడు చుండ్రు. ఇక చెమట పోసిందంటే చాలు... ఒకటే దురద. పోగొట్టుకునే మార్గం చెప్పండి. - ఓ సోదరిమాడుపై ఎక్కువ నూనెలు విడుదలవ్వడం వల్ల ఇలా జిడ్డుగా మారుతుంది.

Published : 23 Jun 2024 01:27 IST

తలస్నానం చేసిన రెండో రోజుకే జుట్టు జిడ్డుగా మారిపోతోంది. దానికితోడు చుండ్రు. ఇక చెమట పోసిందంటే చాలు... ఒకటే దురద. పోగొట్టుకునే మార్గం చెప్పండి.

ఓ సోదరి

మాడుపై ఎక్కువ నూనెలు విడుదలవ్వడం వల్ల ఇలా జిడ్డుగా మారుతుంది. దురద, తలపై చర్మమంతా పొట్టులా రాలడం, గులాబీ రంగులోకి మారడం లాంటివి కనిపిస్తే చుండ్రు లేదా సెబోరిక్‌ డెర్మటైటిస్‌ అనీ అంటాం. దీనివల్ల కొందరిలో నుదుటిపై యాక్నే కూడా వస్తుంది. కాలుష్యం, రసాయనాలున్న షాంపూలు, ఉత్పత్తులు వాడటం వల్లా మాడు పొడిబారి, అలర్జీలతోపాటు కురులూ విపరీతంగా రాలతాయి. కలబంద ఈ సమస్యను తగ్గించడంలో బాగా సాయపడుతుంది. దీని గుజ్జును తలకు పట్టించి, కాసేపాగి తలస్నానం చేయండి. కొబ్బరినూనెలో కొన్నిచుక్కలు టీట్రీ ఆయిల్‌ లేదా నిమ్మరసం కలిపి రాయండి. తలస్నానం చేశాక చెంచా యాపిల్‌ సిడార్‌ వినెగర్‌ను మగ్గు నీటిలో కలిపి, తలమీద పోసుకోవచ్చు. కళ్లుప్పుకి నిమ్మరసం, ఆలివ్‌ ఆయిల్‌ కలిపి, తడి తలకు మర్దనా చేయండి. బేకింగ్‌సోడాని తడి తలకు పట్టించి, బాగా రుద్ది, షాంపూతో కడిగేయాలి. వేపాకుని నీటిలో మరిగించి, ఆ నీటితో తలస్నానం చేసినా మంచిదే. ఇవన్నీ ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించేవే. వీటిలో నచ్చినదాన్ని వారానికి రెండుసార్లు ప్రయత్నించండి. ఇంకా... వాటర్‌ బేస్‌డ్‌ షాంపూలనే వాడండి. సోడియం లోరల్‌ సల్ఫేట్, బెంజాల్‌ పెరాక్సైడ్, సెలీనియం సల్ఫైడ్, సెల్ఫాసెటమైడ్, కీటాకొనజాల్‌ ఉన్న షాంపూలతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. షాంపూ చేశాక ఎక్కువ నీటితో కడగాలి. కండిషనర్‌ వాడుతూనే హెయిర్‌ డ్రైయ్యర్, ఐరనింగ్‌ వంటివాటికి దూరంగా ఉండాలి. వాడే దువ్వెనలనూ తరచూ శుభ్రం చేసుకోవాలి. ఎండలోకి వెళ్లొచ్చినా, వ్యాయామం చేసినా చెమట బాగా పడితే తలస్నానం తప్పనిసరి. ఇంకా జుట్టు ఆరాకే జడ వేసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించండి... సమస్య తగ్గుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్