ఎండే తగలొద్దా?

నుదుటిమీద గీతలు వస్తున్నాయని రెటినాల్‌ క్రీములు వాడదాం అనుకుంటున్నా. కానీ అది రాసుకుంటే అస్సలు ఎండ తగలకూడదు అంటున్నారు... నిజమేనా? ఉదయం నీరెండకి వెళ్లినా సమస్యేనా?

Published : 30 Jun 2024 01:57 IST

నుదుటిమీద గీతలు వస్తున్నాయని రెటినాల్‌ క్రీములు వాడదాం అనుకుంటున్నా. కానీ అది రాసుకుంటే అస్సలు ఎండ తగలకూడదు అంటున్నారు... నిజమేనా? ఉదయం నీరెండకి వెళ్లినా సమస్యేనా?

- ఓ సోదరి

యసు ప్రభావం, అతిగా కనుబొమలు ఎగరేయడం, భృకుటి ముడేయడం వంటివాటి వల్ల నుదుటి మీద గీతలు ఏర్పడతాయి. వచ్చాక కొందరు బొటాక్స్, ఫిల్లర్‌ ఉపయోగిస్తే, మరికొందరు క్రీములు, లేజర్, కెమికల్‌ పీల్స్‌ సాయం తీసుకుంటారు. నిజానికి పాతికేళ్లు దాటాక ముందు నుంచే నియాసినమైడ్, గ్లైకాలిక్‌ యాసిడ్, ట్రెటినాయిడ్, రెటినాల్, యాంటీ ఆక్సిడెంట్లు... వగైరా ఉన్న క్రీములు వాడమంటాం. ఇవి వృద్ధాప్యఛాయలు త్వరగా రాకుండా అదుపు చేస్తాయి. వచ్చాక అవి తీవ్రమవొద్దు అనుకున్నవాళ్ల ఎక్కువ ఎంపిక రెటినాల్‌ అవుతోంది. సాధారణంగా దీన్ని పగలు రాయొద్దు, రాత్రుళ్లే వాడమని చెబుతాం. దీంతో యాక్నే రాదు, చర్మం మృదువుగా మారుతుంది, ఒకేరంగులోకి వస్తుంది, చర్మకణాలూ ఆరోగ్యంగా ఉంటాయి. అయితే ఇన్ని ప్రయోజనాలున్నా కొందరిలో చర్మం పొడిబారడానికి కారణమవుతుంది. అలాంటప్పుడు ఎండలోకి వెళితే దద్దుర్లకు అవకాశముంటుంది. ఇది కాస్త ఖరీదూ ఎక్కువే. పైగా ఎండ వేడికి రెటినాల్‌లోని అణువులు విడిపోయినట్లు అవుతాయి. చర్మంపై ప్రభావవంతంగా పనిచేయవు. అంటే రాసీ ప్రయోజనం లేదన్నమాట. అందుకని వద్దంటాం తప్ప ఇదేమీ చర్మానికి హానికరం కాదు. కాబట్టి, నిర్భయంగా వాడుకోండి. అయితే రాత్రుళ్లే రాసుకోండి. అలాగే సూర్యకిరణాల ప్రభావం నుంచి తప్పించుకోవడానికి పగలు మాయిశ్చరైజర్‌తోపాటు సన్‌స్క్రీన్‌నీ రాస్తే మంచిది. ఇంకా నీరెండకి భయం అక్కర్లేదు కూడా. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్