అలాగైతే ప్రమోషన్‌ వస్తుందా?

నాకు ఐదునెలల పాప. ప్రసూతి సెలవులను మరో ఆరు నెలలు పొడిగించుకోవాలి అనుకుంటున్నా. ఆ అవకాశం ఉంటుందా? ఈ నిర్ణయం భవిష్యత్తులో ప్రమోషన్ల మీద పడుతుందా?

Published : 03 Jul 2024 01:46 IST

నాకు ఐదునెలల పాప. ప్రసూతి సెలవులను మరో ఆరు నెలలు పొడిగించుకోవాలి అనుకుంటున్నా. ఆ అవకాశం ఉంటుందా? ఈ నిర్ణయం భవిష్యత్తులో ప్రమోషన్ల మీద పడుతుందా? 

ఓ సోదరి

ప్రశ్నకు సమాధానం ఒకే అంశంపై ఆధారపడి ఉండదు. అది మీ హోదా, మీ బృందంలో ఎంతమంది ఉన్నారు, మీరు పనిచేసే సంస్థ ఎలాంటిది? లాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే, చాలామందికి ఈ ప్రసూతి సెలవుల పొడిగింపు విషయంలో ఇబ్బందులేమీ ఉండవు. ప్రసవమైన తొలినాళ్లలో బిడ్డతోపాటు మీ ఆరోగ్యంపై దృష్టిపెట్టడమూ చాలా ముఖ్యం. మీకు మెటర్నిటీ సెలవులను పెంచుకునే అవకాశం ఉంటే దాన్ని వాడుకోవడం మంచిది. దానికంటే ముందు మీ మేనేజర్‌తో మాట్లాడండి. వాళ్లు మీ నిబద్ధత, మీరు లేనిలోటు బృంద పనితీరుపై ప్రభావం చూపిస్తుందా?... లాంటి అనేక కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కొందరు మహిళలు అన్ని పనులూ తామే చేయాలని అనుకుంటారు. తద్వారా వారిపై మరింత ఒత్తిడి పడుతుంటుంది. అటు ఉద్యోగాన్నీ, ఇటు తల్లి బాధ్యతల్నీ సమన్వయం చేసుకోలేక సతమతమవుతుంటారు. అందుకే మీకు ఇబ్బంది అనిపిస్తే, ప్రసూతి సెలవులను పొడిగించుకోవడానికి సంకోచించొద్దు. ఏదిఏమైనా కెరియర్‌లో మన ఎదుగుదల... మనం ఎంతగా శ్రమిస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. తిరిగి ఉద్యోగంలో చేరిన తరవాత కూడా మీ పనిని ఇంతే సమర్థవంతంగా చేస్తే, మళ్లీ ట్రాక్‌లోకి రాగలుగుతారు. దాంతోపాటు మీ సంస్థలో తల్లులుగా ఉన్న ఇతర ఉద్యోగినులతోనూ చర్చించి, వాళ్ల అనుభవాలను తెలుసుకోండి. అన్ని విషయాలు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్