పెదాలు... ఎందుకలా?

నా పెదాల అంచులు మొత్తం నల్లగా మారుతున్నాయి. చాలామంది పిగ్మెంటేషన్‌ అంటున్నారు. ఎందుకలా అవుతున్నాయి? ఇదేమైనా సమస్యా? తగ్గించుకునే మార్గం చెప్పండి. 

Published : 07 Jul 2024 02:10 IST

నా పెదాల అంచులు మొత్తం నల్లగా మారుతున్నాయి. చాలామంది పిగ్మెంటేషన్‌ అంటున్నారు. ఎందుకలా అవుతున్నాయి? ఇదేమైనా సమస్యా? తగ్గించుకునే మార్గం చెప్పండి. 

ఓ సోదరి

ది చాలామందిలో కనిపించే సమస్యే! వంశపారంపర్యంగానూ వస్తుంది. ఎనీమియా, డెర్మటైటిస్‌ ఉన్నా పెదాలు నల్లబడతాయి. అంతెందుకు, టీ, కాఫీలు అతిగా తాగేవారు, పెదాలను తరచూ తడపడం, కొరకడం చేసేవారు, ఎండకు ఎక్కువగా తిరిగేవాళ్లలోనూ కనిపిస్తుంది. డైట్‌ చేస్తారా? అది అతిగా చేస్తే పోషకాల లేమి ఏర్పడుతుంది. ఆ ప్రభావం పెదాల మీద పడి, నల్లగా మారతాయి. లిప్‌స్టిక్‌లు, లిప్‌బామ్‌ల్లోని పారాబెన్స్, డైలు, పరిమళాలు, రంగుల కోసం వాడే రసాయనాలు వంటివి అలర్జీకి దారితీసి, చివరకు ఇలా మారతాయి. అందుకే మంచివేనా అని సరిచూసుకోవాలి. ఈసారి నుంచి పెట్రోలియం జెల్లీ, ఆముదం, మినరల్‌ ఆయిల్స్, సెరమైడ్స్, టైటానియం ఆక్సైడ్, జింక్‌ ఆక్సైడ్‌ ఉన్నవీ... పరిమళాలు, ఫ్లేవరింగ్, యూకలిప్టస్, వ్యాక్స్‌ లేని రకాలకే ప్రాధాన్యం ఇవ్వండి. పెదాలను తడపడం, పొట్టుతీయడం వంటివి చేయొద్దు. చదువుకునేటప్పుడు, పనిచేసేటప్పుడు కొందరిలో పెన్ను, గొలుసు వగైరా నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఇదీ సమస్యకు కారణమే. ఈ అలవాటు ఉంటే మానేయండి. బయటికి వెళ్లేటప్పుడు ఎస్‌పీఎఫ్‌ ఉన్న లిప్‌ ప్రొడక్ట్స్‌ను రాసుకోవడం తప్పనిసరి. రక్తపరీక్ష చేయించుకుని రక్త పరిమాణం తగ్గితే మందులు వాడాలి. రోజూ నిద్రపోయే ముందు ఒక బంగాళదుంప ముక్క తీసుకుని దాంతో పెదాలను రుద్దండి. బీట్‌రూట్‌ ముక్క లేదా ఐస్‌తో తరచూ ఉదయంపూట రుద్దినా మంచిదే. పావుచెంచా చొప్పున కలబంద గుజ్జు, క్యారెట్‌ రసాన్ని కలిపి, రోజుకు రెండుసార్లు రాసినా నలుపుదనం తగ్గుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్