Updated : 08/12/2022 20:33 IST

పెద్దగా మాట్లాడకండి..

దువూ, ఉద్యోగవేటలో భాగంగా అమ్మాయిలు ఇంటికి దూరంగా వసతి గృహాల్లో ఉండటం మామూలే. అలాంటప్పుడు మీ వల్ల తోటివారికి ఎలాంటి ఇబ్బందీ కలగకూడదంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి.

* వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలానే మీ వస్తువులూ, పుస్తకాలు ఎక్కడపడితే అక్కడ కాకుండా ఓ చోట సర్దుకోవాలి.

* అందరికీ ఒకే సమయానికి నిద్రపోయే అలవాటు ఉండదు. మరి మీ సంగతి. త్వరగా నిద్రకు ఉపక్రమిస్తే ఇతరుల్ని లైట్లు తీసేయమని ఇబ్బంది పెట్టకండి. ఒకవేళ మీకు ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉంటే.. పెద్దగా ఫోనులో మాట్లాడటం.. గట్టిగా పాటలు పెట్టుకోవడం చేయకండి.

* గదిలో అందరూ నిద్రపోయాక ట్యాబ్‌లూ, ల్యాప్‌టాప్‌లు వాడకపోవడమే మంచిది. దాన్నుంచి వచ్చే వెలుతురు ఇతరులకు ఆటంకం కలిగించొచ్చు.

* స్నేహితులకు సంక్షిప్త సందేశాలు పంపిస్తుంటే ఫోనుని నిశబ్దంలో పెట్టుకోవాలి. లేదంటే వాటి శబ్దం ఇతరులకు కోపం ఇబ్బంది కలిగించొచ్చు.

* గదిలో కుళ్లిపోయిన పండ్లు, నిల్వ ఉండే ఆహారపదార్థాలను ఎప్పటికప్పుడు బయటపడేయాలి.

* తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర స్నేహితురాళ్లు గదికి వస్తానని అడిగినప్పుడు నేరుగా తీసుకొచ్చేయడం సరికాదు. ముందుగా ఉన్నవారితో విషయం చెప్పి వారి అనుమతి తీసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్