Published : 19/03/2021 00:27 IST

పరిమళాల వార్డ్‌రోబ్‌...

న ఆరోగ్యంలో దుస్తులు కూడా ఓ బాగమే. అదెలాగంటారా... వార్డ్‌రోబ్‌ను పరిశుభ్రంగా ఉంచకపోతే, కంటికి కనిపించని దుమ్మూ థూళి, చిన్నచిన్న చిమ్మెటలు, పురుగులు చేరతాయి. ఇవి మన చర్మంపై అలెర్జీకి కారణమవుతాయి. దీనికి మనం  తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో అతిముఖ్యమైంది వార్డ్‌రోబ్‌ను శుభ్రంగా ఉంచుకోవడమే. అంతేకాదు, దుస్తులను సవ్యమైన పద్ధతిలో సర్దుకోకపోతే ఇరుకుగా ఉండి పురుగులు తేలికగా వాటి మధ్యకు చేరే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు నిపుణులు. ఇలాకాకుండా ఉండాలంటే కొన్ని సూచనలను పాటించాలంటున్నారు.
చిమ్మెటలకు దూరంగా...
ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లి వచ్చిన తర్వాత పట్టుచీర, జాకెట్టు వంటివాటికి చెమట పట్టి ఉంటుంది. అలాగే ఒంటికి రాసుకున్న మాయిశ్చరైజర్‌, పెర్‌ఫ్యూమ్‌ వంటివి దుస్తులకు అంటి ఉంటాయి. అందుకే వీటిని  కొన్ని గంటలపాటు ఫ్యాను గాలిలో ఆరనివ్వాలి. ఆ తర్వాత మెత్తని బ్రష్‌తో వాటిపై దుమ్ము పోయేలా మృదువుగా బ్రష్‌ చేయాలి. ఆ తర్వాతే వార్డ్‌రోబ్‌లో భద్రపరచాలి.  అలాకాకుండా వీటిని వెంటనే బీరువాలో ఉంచితే చిమ్మెటలు పట్టడానికి అవకాశం ఉంది. ఇవి దుస్తులపై చిన్నచిన్న రంధ్రాలను చేసే ప్రమాదం ఉంది. వాటిని మనం తిరిగి ధరించినప్పుడు మన ఒంటికి కూడా పలు రకాల అలెర్జీలను తెస్తాయి.  వీటిని వార్డ్‌రోబ్‌లోకి చేరనివ్వకుండా అరికట్టాలంటే  ఎండిన రెండుమూడు రోజ్‌మెరీ ఆకులు, నాలుగు లవంగాలు, తలా రెండు లావెండర్‌, బిరియానీ ఆకులను పలుచని వస్త్రంలో మూటలా కట్టాలి. దీన్ని వార్డ్‌రోబ్‌లో వేలాడేలా ఉంచితే చాలు. దీన్నుంచి వచ్చే ఎస్సెన్షియల్‌ ఆయిల్స్‌ వాసన అంతటా వ్యాపించి చిమ్మెటలు, పురుగులను  అరికడుతుంది.
చెక్క హ్యాంగర్‌
వార్డ్‌రోబ్‌లో అన్నిరకాల దుస్తులనూ ఒకేలా సర్దకూడదు. కొన్నింటిని దళసరిగా ఉండే చెక్క హ్యాంగర్లకు తగిలిస్తే మంచిది. దీనివల్ల ఒకదానికొకటి దూరంగా ఉండి గాలి ఆడేలా ఉండటంతో సిల్కు, పట్టు చీరలు త్వరగా పాడవకుండా ఉంటాయి. అలాకాకుండా ఒకదానిపై మరొకదాన్ని మడతపెట్టి ఉంచితే చీరలపై మరకలు ఏర్పడే ప్రమాదం ఉంది. దీన్ని నిరోధించాలంటే హ్యాంగర్లే సరైన పద్ధతి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి