Updated : 21/03/2021 05:18 IST

అందానికి ఐస్‌!

చల్లచల్లని మంచు ముక్కలు వేసిన షర్బత్‌ తాగగానే ప్రాణం లేచివచ్చినట్లవుతుంది కదా. ఇవి కేవలం నోటికి చల్లదనాన్నే కాదు అందానికి అదనపు హంగులూ అద్దుతాయి. అవేటంటే..
ఐస్‌ మసాజ్‌... ఓ మంచు ముక్కతో ముఖమంతా మృదువుగా మర్దనా చేసి చూడండి.  ఇలా చేయడం వల్ల  రక్తప్రసరణ బాగా జరిగి చర్మం తాజాగా, అందంగా మారుతుంది.
‘ఐస్‌’ ప్రైమర్‌... అందుబాటులో ప్రైమర్‌ లేదా... మరేం ఇబ్బంది లేదు. దానికి బదులుగా మంచు ముక్కను వాడేసేయండి. మేకప్‌ వేసుకునే ముందు ఓసారి ఐస్‌క్యూబ్‌తో ముఖమంతా రాసేయండి. ఇలా చేయడం వల్ల చర్మరంధ్రాలు మూసుకుపోయి మృదువుగా మారుతుంది. అలాగే ఎరుపుదనం, ఉబ్బు లాంటివి తగ్గుతాయి.

నొప్పి పెట్టకుండా... కనుబొమలను ట్రిమ్‌ చేసుకునేటప్పుడు ఆ ప్రాంతంలో నొప్పి పుడుతుంది. అలా కాకుండా ఉండాలంటే ట్రిమ్‌ చేసుకునే ముందు ఐస్‌తో ఆ ప్రాంతంలో రుద్దండి. ఇప్పుడు రోమాలను తొలగిస్తే నొప్పి పుట్టదు. ఎరుపు, మంట లాంటివి ఉండవు.
ఉపశమనం కలిగించేలా... మొటిమలు బాధిస్తోంటే ఆ ప్రాంతంలో శుభ్రమైన నూలు వస్త్రంలో రెండు మూడు మంచు ముక్కలు వేసి ఆ మూటతో మెల్లిగా రుద్దితే నొప్పి తగ్గుతుంది.
కంటి కింద ఉబ్బు పోయేలా.. ఎక్కువసేపు కంప్యూటర్‌ ముందు కూర్చోవడం, ఒత్తిడి... ఫలితంగా కళ్లు బాగా అలసిపోతాయి. దాంతోపాటు కంటికింది సున్నితమైన చర్మం ఉబ్బుతుంది. దీన్ని తగ్గించడానికి మంచు ముక్క చక్కగా ఉపయోగపడుతుంది. మంచు ముక్కతో కంటి చుట్టూ మృదువుగా ఓ అయిదు నిమిషాలపాటు రాసి చూడండి ఉబ్బు తగ్గుతుంది.
కందిన చర్మానికి... ఉపశమనం... ఎండ ప్రభావానికి గురైన చర్మాన్ని తిరిగి కోలుకునేలా చేయడంలో ఐసు ముక్కలు ముందుంటాయి. వీటితో ఆ ప్రభావిత ప్రాంతాల్లో రాస్తే ఫలితం ఉంటుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి