Published : 09/04/2021 00:56 IST

సవాల్‌గా తీసుకోండి!

నేటి మహిళలు ఇంటిని చక్కబెట్టుకుంటూ, విధుల్నీ సమర్థంగా నిర్వర్తిస్తూ... కత్తిమీద సామే చేస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి తెలియకుండానే మూస ధోరణిలోకి వెళ్లిపోవడం, గుర్తింపు దొరకడం లేదని కుంగిపోవడం జరుగుతుంటాయి. అలాకాకుండా మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ముందుకు సాగితే... అనుకున్నది సాధ్యమే.
అలాకాకూడదంటే...
* అన్ని పనులూ మనమే చేయాలనుకోవడం, విరామం లేని పని వంటివాటివల్ల త్వరగా అలసిపోతుంటారు. ఈ తీరు దీర్ఘకాలంలో తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. మంచి నాయకురాలిగా మారాలంటే... మీరొక్కరే పనిచేయడం కాదు... సరిగా పని విభజన జరిగి, ఎవరిపని వారు చేయగలిగితేనే మీరు విజయం సాధించినట్లు అని గుర్తుంచుకోండి. అప్పుడే ఒత్తిడికి దూరంగా ఉంటారు. అందరి మన్ననలూ అందుకోగలుగుతారు.
* చాలామంది తాము అలవాటు పడ్డ విధానానికి భిన్నంగా ఏదైనా జరుగుతుంటే... అంత సులువుగా తీసుకోలేరు. అలాంటి సందర్భాల్లో మీరు ఒంటరి కావొచ్చు. సమస్య ఎలాంటిదైనా సరే! అన్ని కోణాల్లోనూ ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. ఎదుటివారి సలహాలు స్వీకరించడం, వారి అభిప్రాయాలూ పరిగణనలోకి తీసుకోవడం వంటివీ చేయగలగాలి. అప్పుడే ఒత్తిడీ, ఆందోళనా తగ్గుతాయి. అంతిమంగా నిర్ణయం తీసుకునే శక్తినీ అలవరుచుకోవాలి.
* సాధారణంగా మహిళలు సవాళ్లు తీసుకోలేరనీ, ప్రతిపనికీ ఇతరులపై ఆధారపడతారంటారు కొందరు. మీరు పనిచేయడానికి, మిమ్మల్ని మీరు నిరూపించుకునే విషయంలోనూ పరిధులు గీసుకోవద్దు. ఒకవేళ ఎవరైనా మీ శక్తి సామర్థ్యాలను తక్కువ చేస్తుంటే... బాధపడొడ్దు. దాన్ని ఓ సవాలుగా తీసుకుని మీరెంత వైవిధ్యంగా ఆ పని చేయగలరో చేసి చూపండి. విమర్శకులకు మీ చేతలే సమాధానం చెప్పాలి. ప్రతి పనికీ ప్రణాళిక ఉంటే మీదే విజయం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి